బీజేపీతో దళిత బహుజనుల భవిష్యత్తుకు ప్రమాదం

•డిబిపి జాతీయ అధ్యక్షులు వడ్లమూరి కృష్ణస్వరూప్

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, అక్టోబర్ 29 : తెలంగాణలో బీసీలకు సీఎం పదవి అంటూ చెవిలో పువ్వు పెట్టిన దేశ ద్రోహుల పార్టీ బీజేపీ నాయకత్వంతో మెజారిటీ దళిత బహుజన జాతుల భవిష్యత్ కు అత్యంత ప్రమాదమని సామాజిక బానిసత్వం తప్పదని దళిత బహుజన పార్టీ(డిబిపి) జాతీయ అధ్యక్షులు, సుప్రీం కోర్ట్ న్యాయవాది వడ్లమూరి కృష్ణ స్వరూప్ పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా ఎస్సి, ఎస్టీ, బీసీ, మైనారిటీ సామాజిక వర్గంపై దాడులు చేస్తూ అణిచివేస్తున్న బీజేపీ పాలక రాష్ట్రలు, బీజేపీ కాషాయం క్రిమినల్ శక్తులు అణగారిన జాతులను రాజకీయంగా వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఇందులో భాగంగానే తెలంగాణలో మెజారిటీ బీసీ వర్గానికి బీసీ సీఎం అంటూ మోస పూరితంగా భ్రమలోకి నెట్టిందన్నారు. తెలంగాణ రాష్ట్ర శాఖ బీజేపీ పార్టీకి ఉండే బీసీ నాయకత్వాన్ని తొలగించి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నాయకత్వాన్ని తెచ్చారని మండిపడ్డారు. బీసీలకు చెందాలిసిన రాజ్యాధికారాన్ని మార్వాడి వైదిక బ్రాహ్మణ మనువాద వర్గం కాజేసి దోచుకున్నారన్నారు. ఈ ఎన్నికల్లో దళిత బహుజనుల నాయకత్వంలోని రాజకీయ పార్టీల అభ్యుర్థులకు ఓటు వేసి అసెంబ్లీకి చట్ట సభలకు పంపడం ద్వారానే బాధిత బీసీ, ఎస్సి, ఎస్టీ సమాజానికి సోషల్ జస్టిస్, విముక్తి వస్తుందని పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *