బీఎస్పీ రావాలి బహుజనుల బతుకులు మారాలి

పేద ప్రజలను మత్తులో ముంచి రాజ్యాధికారానికి దూరం 
 విద్య వైద్యం సంక్షేమ పథకాలు అందాలంటే బీఎస్పి రావాలి 
 రాజమహేంద్ర వర్మను భారీ మెజార్టీతో గెలిపించండి 
జిల్లా అధ్యక్షులు పానుగంటి ప్రవీణ్ కుమార్
ప్రజాతంత్ర చేవెళ్ల,నవంబర్ 28: బహుజనందరూ విద్య,వైద్యం,సంక్షేమ పథకాలు పొందాలంటే బీఎస్పీ పార్టీ అధికారంలోకి రావాలని  పానుగంటి ప్రవీణ్ కుమార్ అన్నారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆలూర్ గ్రామంలో బీఎస్పీ పార్టీ ప్రచారం నిర్వహించారన్నారు.రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పానుగంటి ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ…ఎన్నో ఏళ్లుగా అగ్రకుల పార్టీలు అధికార దాహంతో పేద ప్రజలను మత్తులోముంచి,పేదరికాన్ని ఆసరగా చేసుకొని,డబ్బులు ఎరగా వేసి ఓట్లు దండుకొని రాజ్యాధికారం తమ గుప్పిట్లో పెట్టుకొని మనలను కులాలుగా,మతాలుగా,వర్గాలుగా విభజించి ఉచిత పథకాలతో మనల్ని మభ్యపెట్టి వాళ్ళు రాజబోగాలు అనుభవిస్తూ,మనల్ని బిచ్చగాళ్ళుగా మార్చేశారన్నారు.ఇన్నాళ్లు బహుజన రాజకీయాలకు బలమైన నాయకుడు లేక,వెలిబోయిన మన రాజకీయాలకు ఊపిరి పోయడానికి “డా”ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన ఉన్నత పదవిని వదిలిపెట్టారన్నారు.మనకోసం ఉద్యోగాన్ని వదులుకొని మన బతుకులు మార్చడానికిరాజకీయాల్లోకి వచ్చారన్నారు.మీ అమూల్యమైన ఓటు బాబాసాహెబ్,సావిత్రిభాయ్ పూలే,మహాత్మా జ్యోతిరావు పూలే,ఛత్రపతి శివాజీ మహారాజ్, పెరియార్ రామస్వామి,సంతు రావిదాస్,కొమరం భీమ్,అబ్దుల్ కలాం లాంటి ఎందరో మహనీయుల ఆశయసాధనకై కృషి చేస్తూ,భారత రాజ్యాంగమే మ్యానిఫెస్టోగా మన భవిషత్తు కోసం పోరాడుతున్న,బహుజన్ సమాజ్ పార్టీ ఏనుగు గుర్తుకు ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించగలరన్నారు.ఈ కార్యక్రమంలో చేవెళ్ల మండల అధ్యక్షులు మొకరం కుమార్,మొకరం రాజు,గ్రామ నాయకులు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *