ప్రజాతంత్ర చేవెళ్ల,నవంబర్ 04: చేవెళ్ల మండల పరిధిలోని ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఎస్పీ చేవెళ్ల మండల అధ్యక్షుడు మొకరం కుమార్ ఆధ్వర్యంలో అంతారం,నవలయ పల్లె గ్రామాలలో వెళ్లి గడప గడపకు బీఎస్పీ మేనిఫెస్టో లో పొందుపరిచిన అంశాల గురుంచి ప్రజలకు బీఎస్పీ మండల అధ్యక్షులు మొకరం కుమార్ వివరించమన్నారు.బీఎస్పీ పార్టీ అధికారంలోకి వస్తే పేద ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు.బీఆర్ఎస్,బిజె పి పార్టీలు బడుగు బలహీన వర్గాల ప్రజలకు కనీస సదుపాయాలు కల్పించలేదన్నారు.ప్రజలకు హామీలు ఇస్తారు నెరవేర్చడన్నారు.బీఎస్పీ పార్టీ అధికారంలోకి వస్తే మేనిఫెస్టోలో పొందుపరిచిన అన్ని హామీలను నెరవేరుస్తామని మొకరం కుమార్ ధీమా వ్యక్తం చేశారు.పేద ప్రజల పక్షాన నిలబడ్డ పార్టీ బీఎస్పీ అన్నారు.ప్రజలు బిఆర్ఎస్ బిజెపి పార్టీల పరిపాలనలో మోసపోతున్నారన్నారు. ప్రజలందరేకమై బిఎస్పి పార్టీని గద్దె ఎక్కించాలని చేవెళ్ల మండల అధ్యక్షులు మొకరం కుమార్ అన్నారు.ఈ కార్యక్రమంలో చేవెళ్ల మండల యువజన అధ్యక్షులు మొకరం రాజు,గ్రామ అధ్యక్షులు చించడం రాజు,బిట్ సెల్ ఇంచార్జ్ అనిల్, రాఘవ్,రమేష్,అనిల్, మహేష్,దేవయ్యతదితరులు పాల్గొన్నారు.
బీఎస్పీ పార్టీని గద్దెక్కించాలి





