పటాన్ చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 13: పటాన్ చెరు నియోజకవర్గ బీ ఎస్పీ లోకి చేరికల పర్వం కొనసాగుతుంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ లకు చెందిన సుమారు వందలాదిమంది ప్రజలు తమ పార్టీలకు గుడ్ బై చెప్పి నీలం మధు ముదిరాజ్ కు సమక్షంలో బీ ఎస్పీ లో చేరారు.బహుజన ఆత్మ గౌరవ పోరాటంలో తాము సైతం భాగస్వాములం అవుతామని పటాన్ చెరు మండలం చిన్న కంజర్లకు చెందిన 25 మంది,
అమీన్ పూర్ మండలం సుల్తాన్ పూర్ కు చెందిన 20 మంది దయారకు చెందిన 20 మంది కిష్టారెడ్డిపేట నుంచి 50 మంది బీఎస్పీ లో చేరారు. వీరందరికీ బీఎస్పీ కండువాలు వేసి నీలం మధు ముదిరాజ్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతూ… బహుజనుల అస్తిత్వానికై ఆత్మగౌరవానికి పోరాటం చేస్తున్న తనకు మద్దతుగా కదలివస్తున్న ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రతి ఒక్కరు మన అస్తిత్వ పోరాటంలో భాగస్వాములై, సైనికుల వలే పని చేస్తూ ప్రజలను చైతన్యవంతం చేస్తూ బీఎస్పీ పార్టీ గెలుపులో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో ఏనుగు గుర్తుపై ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.




