బీఆర్‌ఎస్‌ వెంటే ఉంటామంటూ ఏకగ్రీవ తీర్మానాలు

కుత్బుల్లాపూర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 17 : ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ల నేతృత్వంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని పలు కాలనీ బస్తీలవాసులలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించి ప్రజల మన్ననలు చూరగొంటున్నారు. బీఆర్‌ఎస్‌ వెంటే మేము ఉంటామంటూ పలు కాలని, బస్తీ వాసులు తమ సంపూర్ణ మద్దతును తెలియజేస్తూ హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిపించుకుని, తమ ప్రాంతాలను మరింత అభివృద్ధి చేసుకుంటామని ఏకగ్రీవ తీర్మానాలు చేస్తున్నారు. మంగళవారం 125 గాజులరామారం డివిజన్ పరిధిలోని ఎన్.టి.ఆర్ నగర్, అంబేద్కర్ నగర్  కాలనీ వాసులు రానున్న ఎన్నికలలో ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ కే తమ మద్దతు అని ఏకగ్రీవ తీర్మానాలు చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే తమ కాలనీలకు ఆహ్వానించి తమ కాలనీల అభివృద్ధికి కృషి చేసినందుకు, ఎల్లవేళలా తమకు అండగా వుండి సహాయ సహకారాలు అందించినందుకు ఘనంగా సన్మానించి నవంబర్ 30 వ తేదీన జరిగే అసెంబ్లీ ఎన్నికలలో అత్యధిక మెజారిటీతో ముచ్చటగా మూడవసారి గెలిపించుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్.టి.ఆర్ నగర్  ప్రెసిడెంట్ ఇబ్రహీం ఖాన్  జనరల్ సెక్రటరీ, చంద్రశేఖర్ గౌడ్, తాహెర్, వీరేష్, ఉపేందర్, శ్రీనివాస్ గౌడ్, హాజీ, సల్మాన్, హమీద్, అంబేద్కర్ నగర్ – నవాబ్, సంతోష్, జహాంగీర్, బిలాల్ భాయ్, రాజా భాయ్, వెంకట్, ఇమ్రాన్, గోపాల్ రావు, అసర్ ఖాన్, సాధు ఖాన్, విశాల్, దేవిదాస్, మధుకర్, బాలిక, వసంత, సీనియర్ నాయకులు కస్తూరి బాలరాజ్, అడ్వకేట్ కమలాకర్, రషీద్ బేగ్, పర్శ శ్రీనివాస్,  మూసా ఖాన్, మసూద్, దూలప్ప, గోవర్ధన్ రెడ్డి,  దిలీప్, చెట్ల వెంకటేష్, ఇమ్రాన్, చిన్న చౌదరి, నగేష్, సుంకరి చందు, మహేష్, తెలంగాణ సాయి, జునైద్, లక్ష్మణ్, హమీద్, మౌలానా మహిళా నాయకురాలు, ఫార్జ్హన, షమీమ్, మామి, సుజాత, పార్వతి, ఊర్మిళ, ఎన్.టి.ఆర్. నగర్ సంక్షేమ సంఘం  తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *