బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సకల హంగులు సంతరించుకున్న తండాలు

తాండూరు, ప్రజాతంత్ర, ఆగస్ట్ 18: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తండాలు పల్లెల రూపు రేఖలు పూర్తిగా మారిపోయి అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుపోతున్నాయని ఎంపీపీ బాలేశ్వర గుప్తా అన్నారు. శుక్రవారం యాలాల మండల పరిధిలోని సంగాయిగుట్ట తాండలో 30 లక్షలతో నిర్మిస్తున్న బీటీ రోడ్డు పనులను సర్పంచ్ లలితా భాయ్ తో కలిసి ప్రారంభించి మాట్లాడారు. సంగాయిగుట్ట తండా అనుబంధ గ్రామమైన తొపెర్ల గడ్డ తండా బీటీ రోడ్డు పనులను 90 లక్షలతో పూర్తి చేయనున్నమన్నారు. ఆ పనులను రెండు మూడు రోజుల్లో ప్రారంభించ నున్నామన్నారు. ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి చొరవతో గ్రామ అభివృద్ధికి నిధులు తీసుకువచ్చామన్నారు. మండల పరిధిలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకు వెళ్లడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకొని ముందుకు వెళ్తున్నామన్నారు. ప్రజా క్షేత్రంలో అనునిత్యం ప్రజల మధ్య ఉంటూ మండల అభివృద్ధికి పాటుపడుతున్నానన్నారు. భవిష్యత్తులో రాజకీయాలలో కీలక పాత్ర పోషిస్తూ మండల అభివృద్ధిలో పాలుపంచుకుంటానన్నారు. గ్రామ సర్పంచ్ లలితా బాయ్ నేతృత్వంలో గ్రామం అన్ని రంగాల్లో ముందుకు వెళుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ రాములు ఉప సర్పంచ్ కిషన్, గ్రామ బిఆర్ఎస్ అధ్యక్షులు రూప్ సింగ్, డి ఈ కరుణాకర చారి, ఏఈ సంతోష్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *