తాండూరు, ప్రజాతంత్ర, నవంబర్ 3: బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి ఉద్యమకారులు మద్దతు ఉంటుందని ఉద్యమకారులు ముజీబ్ వీరమని ప్రకాష్ గౌడ్ వెంకటయ్య ఇస్మాయిల్ మహేష్ గౌడ్ తదితరులు పేర్కొన్నారు శుక్రవారం పట్టణంలోని పాత తాండూర్ లోని ముజీబ్ ఖాన్ ఆయన నివాసంలో విలేకర్ల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఉద్యమకారులు మాట్లాడుతూ స్థానికుడైన టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి ఎన్నికల్లో మద్దతు తెలియజేస్తున్నామని అన్నారు ఎన్నికల్లో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని భారీ మెర్జేటితో గెలిపించేందుకు తాము నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోను ప్రతి గడపగడపకు వెళ్లి ప్రజలకు వివరించి రోహిత్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించేందుకు కృషి చేస్తామని తెలిపారు ఈ సమావేశంలో ఉద్యమకారులు రాజ్ కుమార్ వెంకటయ్య యాదవ్ నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ధి ఉద్యమకారులు ముజీబ్ ఖాన్





