మహేశ్వరం టౌన్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 21: బీఆర్ఎస్ తోనే అభివృద్ధి సాధ్యమని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం గ్రామానికి చెందిన బీజేవైఎం మండల మాజీ ప్రధాన కార్యదర్శి ఆదిల్ల మల్లేశ్ మంత్రి సమక్షంలో బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..నియోజకవర్గంలో జరుగు తున్న అభివృద్ధిని చూసి కాంగ్రెస బీజేపీ పార్టీలకు చెందిన నాయకులు బీఆర్ఎస్ లో రుతున్నారనిఅన్నారు . అభివృద్ధి, సంక్షేమానికి బీఆర్ఎస్ పార్టీ పెద్ద పీట వేస్తున్నదన్నారు పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తామన్నారు. ఈ ర్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు పి.కార్తికడ్డి, సీనియర్ నాయ కుడు కర్రోళ్ల చంద్రయ్య ముదిరాజ్, మీనాజ్ పటేల్, కో ఆప్షన్ సభ్యుడు సయ్యద్ అదిల్ అలీ, మాజీ పీఏసీఎస్ చైర్మన్ అంబయ్యయాదవ్, పీఏసీఎస్ డైరెక్టర్ ప్రభాకర్, శ్రీనివాస చారీ, శ్రీను, అనిల్ గౌడ్ పాల్గొన్నారు.



