కూకట్ పల్లి, ప్రజాతంత్ర, నవంబర్ 15 : అభివృధి చేస్తాడు అని నమ్మి ఓటేస్తే నిరుపేదల ప్రజల భూములను లాక్కొని కేసీఆర్ రోడ్డుపాలు చేశారని మళ్లీ ఓటేసి మోసపోవద్దు అని, దశాబ్ది కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించిన ఘనత సూన్యమే అని కూకట్పల్లి అసెంబ్లీ బిజెపి ఇంచార్జి మాధవరం కాంతారావు ఆరోపించారు. బుధవారం కూకట్పల్లి అసెంబ్లీ పరిధిలోని బాలానగర్ డివిజన్ నందు ఉమ్మడి జనసేన పార్టీ అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ ఎన్నికల ప్రచారంలో కాంతారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంతారావు మాట్లాడుతూ కూకట్పల్లి అసెంబ్లీలో ముఖ్యంగా బాలానగర్ డివిజన్ నందు అనేక సమస్యలు ఉన్నాయన్నారు. వర్షాకాలంలో ప్రధాన రోడ్లపై నీరు నిలువ ఉండడం రాకపోకలకు ఆటంకం కలుగుతుందన్నారు. డ్రెనేజీ, సానిటరీ శాఖలు నిర్లక్ష్యం వహిస్తున్నారని, ఓవైపు ప్రజలు కనీస మౌలిక సదుపాయాలు లేక అవస్థలు పడుతుంటే, కూకట్పల్లి శాసన సభ్యులు కబ్జాలు సెటిల్మెంట్ పనుల్లో తన పనితనం చూపిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం ఎన్ని నిధులను విడుదల చేసినా వాటిని పక్కదారి పట్టిస్తున్న ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుందని విమర్శించారు. అభివృద్ధి పేరుతో ప్రజాధనం వృధా చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే బీఆర్ఎస్ పార్టీకి వోటేసినట్లేననీ, వ్యారంటీ గ్యారంటీలతో ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. హంగు ఆర్భాటాలు అసత్య ప్రచారాలతో పాలనను గాలికి వదిలేసి కాలయాపన చేస్తున్న ఈ బిఆర్ఎస్ పార్టీ నాయకుల పనితీరుకు ఈ ఎన్నికల్లో ప్రజల తప్పక బుద్ది చెబుతారని అన్నారు. పాదయాత్రలో ప్రజలు ఉమ్మడి బీజేపీ జనసేన పార్టీ అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ కి సంపూర్ణ మద్దతు లభిస్తోందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని రంగాలను అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా కాంతారావు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బిజెపి, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ కి ఓటేసి మరోసారి మోసపోవద్దు మాధవరం కాంతారావు





