బీఆర్ఎస్ అభ్యర్థి పైలట్ రోహిత్ రెడ్డిని మరోసారి భారీ మెజారిటీతో గెలిపించాలి

తాండూరు, ప్రజాతంత్ర, నవంబర్ 16: బి ఆర్ ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిని మరోసారి ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని ఆ పార్టీ సీనియర్ నాయకులు పట్లొల నర్సింలు  ప్రజలను కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం పట్టణంలోని పలు వార్డులో పార్టీ శ్రేణులతో కలిసి బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిని గెలుపుకై ఇంటింటి ప్రచారాన్ని ముమ్మారంగా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తోనే తాండూర్ అభివృద్ధి సాధ్యమని అన్నారు. టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తేనే అన్ని సంక్షేమ పథకాలు కొనసాగుతాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మోసపూరిత మేనిఫెస్టో గ్యారెంటీ వారంటీ లేని ఆరు పథకాలను చూసి ఓటు వేస్తే మోసపోతామని అన్నారు. కాంగ్రెస్  అధికారంలోకి వస్తే అంత సంక్షోభమే తప్ప అభివృద్ధి జరగదని అన్నారు. టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ప్రజా సంక్షేమం అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో స్థానికుడైన ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిని మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించుకునేందుకు అందరూ కలిసికట్టుగా టిఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *