బీఅర్ఎస్ తోనే ప్రజలకు సుపరిపాలన

తాండూరు, ప్రజాతంత్ర, నవంబర్ 2: రాష్ర్టంలో బీఆర్ఎ తోనే ప్రజలకు సుపరిపాలన అందుతుందని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సతీమణి ఆర్తి రెడ్డి అన్నారు. పట్టణం లోని 1, 24 వర్డులో ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంక్షేమ ఫలాలు అందుకుంటున్నట్లు తెలిపారు. ఇవన్ని కొనసాగాలంటే మరోసారి రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని అన్నారు. తాండూరులో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి చూసి మరోసారి ఇక్కడ గులాబీ జెండా ఎగరాలని మద్దతు తెలుపుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ కొట్రిక విజయ్ లక్ష్మి, మునిసిపల్ వైస్ చైర్మన్ దీపా నర్సింలు, మార్కెట్ కమిటీ చైర్మన్ వీణా శ్రీనివాస్ చారి, ఫ్లోర్ లీడర్ శోబా రాణి, కౌన్సిలర్ సంగీత ఠాకుర్, పరిమలా, ఎంపీటీసీ ప్రవీణ్ పటేల్, అనిత, రాజన్ గౌడ్, కేశవ్, వెంకట్ సుబయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *