బీఅర్ఎస్ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం

తాండూరు, ప్రజాతంత్ర, నవంబర్ 7: బీఅర్ఎస్ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి  అన్నారు. మంగళవారం తాండూరు మండలం చేంగోల్ గ్రామానికి కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సమక్షంలో బీఅర్ఎస్ పార్టీలో చేరారు. సర్పంచ్ మల్లేశ్వరి శేకర్ గౌడ్, సీనియర్ నాయకులు వేణు గౌడ్ ఆధ్వర్యంలో పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. బీఅర్ఎస్ మానిఫెస్టో ను ప్రజలకు వివరించి కాంగ్రెస్ పార్టీ మోసాలను బయటపెట్టాలన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా తాండూరుకు అత్యధిక నిధులు తీసుకువచ్చిన విషయాన్ని ప్రజలకు తెలియజేయాలన్నారు. వచ్చే ఎన్నికల్లో తన గెలిపిస్తే మరింత అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. తాండూరు అభివృద్ధి తమతోనే సాధ్యమని అన్నారు కాంగ్రెస్ పార్టీ మోసాలకు మోసపూరిత హామీలకు మోసపోవటం సూచించారు రాష్ట్రంలో రాబోయేది మళ్లీ టిఆర్ఎస్ ప్రభుత్వం మేనని అన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *