సంగారెడ్డి, ప్రజాతంత్ర, నవంబర్ 7: నారాయణఖేడ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సురేష్ కుమార్ షెట్కార్ ను అధిష్టానం ప్రకటించిన విషయం తెలిసిందే.మంగళవారం బి ఫామ్ ను తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి మాణిక్ ఠాగూర్ గారి చేతులు మీదుగా సురేష్ కుమార్ షెట్కార్ కూతురు నేషనల్ స్పోక్ పర్సనల్ డాక్టర్ గిరిజ షెట్కార్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు కె. శ్రీనివాస్, అభిషేక్, శివరావు షేట్కార్, ఏఐసీసీ ఇంచార్జి రోహిత్ చౌదరి, మన్సూర్ అలీ ఖాన్, ప్రోటోకాల్ ఫైమ్ సూరజ్ తీవరీలు ఉన్నారు.
బి ఫామ్ అందుకున్న సురేష్ కుమార్ షెట్కార్ కూతురు



