బి ఆర్ ఎస్ పార్టీ కార్యకర్తల అందరూ నా కుటుంబ సభ్యులే  బండారి లక్ష్మారెడ్డి

 ఉప్పల్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 25:   బి ఆర్ ఎస్ పార్టీ కార్యకర్తల అందరూ నా కుటుంబ సభ్యులే అని,   కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటా అని ఉప్పల్ నియోజకవర్గ  బి ఆర్  ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి  అన్నారు.శుక్రవారం మల్లాపూర్ వార్డ్ కార్యాలయం లో మల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి గారి అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో బండారి లక్ష్మారెడ్డి గారు కార్యకర్తలకు ఉద్దేశించి ప్రసంగించారు.మీకు అందరికీ అందుబాటులో వుంటా అని అందరినీ కలుపుకొని వెళ్తా అని ఏలాంటి గ్రూప్ రాజకీయాలకు తావు లేకుండా  బి ఆర్ ఎస్ పార్టీ కార్యకర్తల అందరూ నా కుటుంబ సభ్యులే అని అన్నారు. ఎన్నికల్లో తమ బిడ్డగా నన్ను ఆశీర్వదించాలని కోరారు.ఈ కార్యక్రమంలో బి ఆర్  ఎస్ నాయకులు కాటార్ల భాస్కర్, బి ఆర్  ఎస్ పార్టీ మల్లాపూర్ డివిజన్ ప్రధాన కార్యదర్శి వాసు దేవ గౌడ్,కుంటి కృష్ణ, పాండు, దయాకర్,హమాలీ శ్రీను, సతీశ్, పీరు నాయక్, నరేశ్,అంజి, యాది, మల్లేశ్,కర్ణ, సనాల రవి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *