శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, అక్టోబర్ 27: బిఆర్ఎస్ పార్టీ తోనే ప్రజా సంక్షేమం సాధ్యమని ప్రభుత్వ విప్ శేర్లింగంపల్లి ఎమ్మెల్యే ఆరకపూడి గాంధీ సతీమణి శ్యామలాదేవి అన్నారు. ఈ మేరకు ఆమె శనివారం చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి, పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి డివిజన్ పరిధిలోని కె ఎస్ ఆర్ ఎన్ క్లేవ్ కాలనీ, పలు కాలనీలలో ఇంటింట ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అనేక మహిళసంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి మహిళల సాధికారిత సాధించే దిశగా కార్యక్రమాలు చేపట్టిన ఘనత బిఆర్ఎస్ పార్టీకేదక్కుతుందన్నారు. మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు ,ఆసరా పింఛన్లు, కల్యాణ లక్ష్మీ షాది ముబారక్, ఒంటరి మహిళల కు పింఛన్లు,కేసీఆర్ బీమా ప్రతి ఇంటికి ధీమా అని, అందరికి సన్న బియ్యం ,అసరా పెన్షన్ల పెంపు,దివ్యాంగుల పెన్షన్ పెంపు,400 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇవ్వడం మహిళలకు పెద్ద ఉపశమనం అని, ఆరోగ్య శ్రీ గరిష్ట పరిమితి 15 లక్షల పెంపు చేయడం గొప్ప విషయం అని ,లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు , అర్హులైన పేద మహిళలదరికి ప్రతి నెల 3,000 రూపాయలు జీవన భృతి ని అందించడం ,రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలిస్తే వచ్చే ఐదేండ్ల కాలంలో ప్రజల సంక్షేమం, అభివృద్ధికి ఏం చేయబోతున్నామని పూర్తి ప్రణాళికను వివరించారు అన్నారు. కేసీఆర్ బీమా పేరుతో కొత్త స్కీమ్ అమలు చేసి ప్రజలందరికీ రూ.5 లక్షల చొప్పున కేసీఆర్ బీమా, తెల్ల రేషన్ కార్డుదారులందరికీ సన్నబియ్యం, ఆసరా పింఛన్ కు దశల వారీగా నెలకు రూ.5 వేలకు పెంపు వంటి పలు కీలక హామీలు నెరవేరాలంటే బి ఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. దళిత బంధు, రైతు బంధు కొనసాగించడం, మైనార్టీల సంక్షేమానికి బడ్జెట్ పెంచడం, మైనార్టీలకు జూ.కాలేజీలను డిగ్రీ కాలేజీలుగా అప్ గ్రేడ్ చేయడం వంటి నిర్ణయాలు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. ఇప్పటికే వేలాది రూపాయల కోట్లతో శేర్లింగంపల్లి నియోజకవర్గంను అన్ని రంగాలలో అభివృద్ధి చేసిన ప్రభుత్వ విప్ శేర్లింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీని గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
బి ఆర్ ఎస్ పార్టీతోనే ప్రజా సంక్షేమం సాధ్యం. ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ సతీమణి శ్యామలాదేవి




