ఖండించిన మంత్రి హరీష్ రావు
బిబిసిలో ఒక వార్త వొచ్చిందని తెల్లారి ఐటీ దాడులు చేయించారని పేర్కొంటూ జనాలు నవ్వుకుంటున్నారని మంత్రి హరీష్ రావు అన్నారు. ప్రపంచం ముందు దేశం పరువు పోతున్నది..ఇదా పద్దతి, నాయకులకు ఓపిక ఉండాలి, సమాధానం చెప్పే శక్తి యుక్తులు ఉండాలే కానీ ఇది పద్దతి కాదని అన్నారు. వార్తలు వేస్తావా…ఐటి, ఈడి తోలుతా అంటే దేశం పరువు పోదా అని ప్రశించారు.
నిజంగా వార్తలో తప్పు ఉంటే ఖండించాలి, ఏది నిజమో చెప్పాలి, ప్రజల ముందుకు వొచ్చి మాట్లాడాలన్నారు. బిబిసి అంటే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సంస్థ.. దాని మీద దాడి చేసి దేశం పరువు తీసెలా కేంద్రం వ్యవహరిస్తున్నదని మంత్రి హరీష్ రావు అన్నారు. బిజెపి లెక్క జుటా చెప్పాల్సిన అవసరం లేదని, తాము చేసింది చెప్పుకుంటామని, ప్రజల వద్దకు వెళ్తామని మంత్రి హరీష్ రావు తెలిపారు.



