వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, ఆగస్ట్ 17: బిజెపి మాజీ నాయకులు ఎట్లాగైనా ఈసారి ఎమ్మెల్యే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించాలని లక్ష్యంతో ఏ నియోజకవర్గంలో తమకు అనుకూలంగా ఉంటుందోనని అనుచరులతో మంతనాలు జరుపుతూ ఆ వైపు దిశగా పరుగులు తీస్తున్నట్లు కనిపిస్తుంది. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యేగా మాజీ మంత్రిగా 25 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా ఏకధాటిగా గెలుస్తూ ప్రజల్లో మంచి పలుకుబడి ఉన్న మాజీ మంత్రి చంద్రశేఖర్ ఇటీవలే బిజెపికి రాజీనామా చేశారు. ఎలాగైనా ఈసారి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందాలని లక్ష్యంతో పావులు కదుపుతూ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు మార్గమం సుగామం చేసుకున్నట్లు తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీలో చేరి చేవెళ్ల లేదా జైరాబాద్ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందాలని లక్ష్యంతో మాజీ మంత్రి చంద్రశేఖర్ పక్కా ప్లాన్ వేసుకుని ముందుకు సాగుతున్నారు. ఇదిలా ఉంటే మాజీ బిజెపి సీనియర్ నాయకులు శేరి నర్సింగ్ రావు గత 2009 ఎన్నికల్లో వికారాబాద్ లో బిజెపి పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. విస్తృత ప్రచారం నిర్వహించి బిజెపిని గ్రామీణ స్థాయిలో పూర్తిగా తెలిసిపోయేలా ప్రచారం నిర్వహించి ఓవైపు చూస్తే ఎమ్మెల్యేగా గెలుస్తాడా అన్న విధంగా ఆలోచింపజేశారు. ఆ తర్వాత టిఆర్ఎస్ పార్టీలో చేరారు. అనివార కారణాల వల్ల బిజెపిలో ప్రస్తుతం లేనట్టు తెలుస్తుంది. తాను కూడా రానున్న ఎన్నికల్లో చేవెళ్ల లేదా వికారాబాద్ జహీరాబాద్ స్థానాల్లో ఏదైనా పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందాలని లక్ష్యంతో పావులు కదుపుతూ ముందుకు సాగుతున్నారు. ఈ ఇరువురు మాజీ బిజెపి నాయకులు తాము ఎక్కడి నుంచి పోటీ చేయాలని ఎక్కడైతే మనం ఎమ్మెల్యేల గెలుస్తామని రహస్యంగా మంత్రాలు జరిపినట్లు తెలుస్తుంది. ఏది ఏదైతేనేమి రానున్న ఎన్నికల్లో ఇరువురు నేతలు ఎమ్మెల్యేలు గెలుపొంది అసెంబ్లీలో అడిగిడాలని లక్ష్యంతో భారీ ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. ఈ ఇరువురు నేతల పక్కా ప్రణాళికలో ఎంతోమంది నాయకులు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేవారు భయాందోళనతో అడుగులను తన అనుచరులతో కంట కనిపెడుతూ వారి వివరాలను వారి ప్రణాళికలను అడిగి తెలుసుకునడంలో నిమగ్నమయ్యారు. వీరు కాంగ్రెస్లో చేరితే వారికి ఎలాంటి నష్టం జరుగుతుందోనని ఆందోళనలో ఉన్నారు.



