స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలుచేశారన్న ఆరోపణ
క్షమాపణ చెప్పడానికి నిరాకరించడంతో సస్పెన్సన్ తీర్మానాన్ని అమలు చేసి బయటకు పంపిన స్పీకర్
అకారణంగా సస్పెండ్ చేశారని ఈటల మండిపాటు…
అసెంబ్లీ వద్ద స్వల్ప ఉద్రిక్తత…పోలీస్ వాహనంలో ఎక్కించి శామిర్‌పేటకు తరలింపు
ఈటల సస్పెన్షన్ దారుణం…న్యాయపోరాటం చేస్తాం : బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 13 : బీజేపీ సభ్యుడు ఈటల రాజేందర్‌ను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు. అసెంబ్లీ నుంచి ఈటల రాజేందర్‌ను సస్పెండ్ చేస్తూ.. అసెంబ్లీ వ్యవహారాల మంత్రి ప్రశాంత్ రెడ్డి.. తీర్మానాన్ని ప్రవేశపెట్టగా.. దాన్ని అసెంబ్లీ కూడా ఆమోదించింది. స్పీకర్‌ను ఉద్దేశించి వి•డియా పాయింట్‌లో ఈటల రాజేందర్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. దానిపై తీవ్ర అభ్యంతరాలు వచ్చాయి. ఆ వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని సభలోనే ప్రభుత్వం వైపు నుంచి సూచనలు చేశారు. అయినా ఆయన వెనక్కి తగ్గకపోవడంతో ఈ సెషన్ మొత్తానికి ఈటలను సస్పెండ్ చేస్తూ మంత్రి ప్రశాంత్‌రెడ్డి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దాన్ని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆమోదించారు. మార్చిలో బడ్జెట్ సెషన్‌లో ఆర్థిక మంత్రి ప్రసంగానికి అడ్డు తగిలినందుకు సభ నుంచి సస్పెండ్ చేశారు. ఈసారి స్పీకర్ పోచారంపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు సభ నుంచి బహిష్కరించారు. ఈ సెషన్ మొత్తానికి సస్పెండ్ చేశారు. 3వ రోజు మంగళవారం సభ ప్రారంభం అవుతూనే ఈటల అంశాన్ని అధికార పార్టీ సభ్యులు ప్రస్తావించారు. అనుచిత వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పి చర్చలో పాల్గొనాలని మంత్రి ప్రశాంత్‌రెడ్డి సూచించారు. సీనియర్ సభ్యుడైన ఈటల..తీరు సరిగా లేదని అన్నారు. ఐతే.. తనను సస్పెన్షన్ చేయాలనే నిర్ణయాన్ని ఈటల తప్పుపట్టారు. సభలో తనను మాట్లాడనివ్వకుండా చేసేందుకే ఇలా చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ వాదోపవాదాల మధ్యే సభలో తీర్మానం పెట్టడం.. సస్పెన్షన్‌ను స్పీకర్ ఆమోదించడం జరిగిపోయాయి.
అకారణంగా సస్పెండ్ చేశారని ఈటల మండిపాటు…అసెంబ్లీ వద్ద స్వల్ప ఉద్రిక్తత…పోలీస్ వాహనంలో ఎక్కించి శామిర్‌పేటకు తరలింపు
అసెంబ్లీ వద్ద పోలీసులు ప్రవర్తించిన తీరుపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బానిసలా వ్యవహరించవద్దంటూ పోలీసులపై మండిపడ్డారు. వి• నాశనానికే ఇదంతా చేస్తున్నారు. సంవత్సర కాలంగా కుట్ర చేస్తున్నారు. గెలిచినప్పటి నుండి ఇప్పటి వరకు అసెంబ్లీకి హాజరుకాకుండా చేస్తున్నారు. గొంతు నొక్కుతున్నారు. గద్దె దించే వరకు విశ్రమించను. వి• తాటాకు చప్పుళ్లకు భయపడనని అంటూ ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. కాగా… తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వెంటనే ఈటల రాజేందర్‌పై అధికారపార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు విరుచుకుపడ్డారు. మరమనిషి అంటూ చేసిన వ్యాఖ్యలను ఈటల వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరమనిషి అంటూ చేసిన వ్యాఖ్యలపై ఈటలను సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. అనంతరం బయటకు వొచ్చిన ఈటలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, ఈటలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసు వాహనం ఎక్కేందుకు నిరాకరించిన ఈటలను బలవంతంగా ఎక్కించి శావి•ర్‌పేటలోని ఆయన నివాసంలో విడిచిపెట్టారు. ఈటల అరెస్ట్ సమయంలో అసెంబ్లీ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.
ఈటల సస్పెన్షన్ దారుణం…న్యాయపోరాటం చేస్తాం : బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
తెలంగాణ అసెంబ్లీ నుంచి బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను సస్పెండ్ చేయటాన్ని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. మంగళవారం వి•డియాతో మాట్లాడుతూ..మరమనిషి అంటేనే సస్పెండ్ చేస్తారా? అంటూ ప్రశ్నించారు. ఈటల రాజేందర్ అన్నదాంట్లో తప్పేముందని అడిగారు. కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టడానికే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించట్లేదా అని నిలదీశారు. ఈటల సస్పెన్షన్‌పై న్యాయపోరాటం చేస్తామని తెలిపారు. నిండు సభలో ప్రధానిని ఫాసిస్ట్ అంటారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు అసెంబ్లీ నడిపే అర్హత సీఎం కేసీఆర్‌కు లేదన్నారు. సీఎంను సభ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. వొచ్చే ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్‌ను సస్పెండ్ చేస్తారని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
ఈటల రాజేందర్ ను సభ నుంచి సస్పెండ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. కేసీఆర్‌కు అసెంబ్లీని నడిపే అర్హత లేదని..ప్రజలే బుద్ధి చెబుతారని ఫైర్ అయ్యారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించినందుకే తమ ఎమ్మెల్యేని ఇప్పటికే ఒకరిని జైలుకు పంపించారని..ఇప్పుడు మరో ఎమ్మెల్యేని సభ నుంచి సస్పెండ్ చేశారన్నారు. కేసీఆర్, కేటీఆర్, కవిత ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేదన్నారు. ఆర్టీసీ ఆస్తులను 99 ఏళ్ల పాటు లీజుకిచ్చి లబ్ది పొందే కుట్రకు తెర లేపారన్నారు. ఆర్టీసీని నిర్వీర్యం చేయడానికి కేసీఆర్ కంకణం కట్టుకున్నాడని విమర్శించారు. ఆర్టీసీ కార్మికులకు బెనిఫిట్స్ ఇవ్వడం లేదన్నారు.


