బిజెపి ఆలోచనలన్నీ అమ్మకాలపైనే

మెదక్‌,‌జూన్‌8: ‌బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఆర్టీసీని సైతం అమ్మకానికి పెడుతోందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. కాంగ్రెస్‌, ‌బీజేపీలకు ప్రజలను మోసం చేయడమే తెలుసునని ఆరోపించారు. బీజేపీకి గుజరాత్‌ ‌తప్ప మరో ఆలోచన లేదన్నారు. కేంద్రం తీరు తెలంగాణకు మాటలు.. గుజరాత్‌కు మూటలు ఉన్నట్లుందని ఎద్దేవా చేశారు. మెదక్‌ ‌జిల్లా నర్సాపూర్‌ ‌బస్‌ ‌డిపోను మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తో కలిసి ప్రారంభించారు. అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో ఎండాకాలంలోనూ కరెంటు కష్టాలు లేవని, 70 ఏళ్లలో గత ప్రభుత్వాలు ఒక్క చెక్‌ ‌డ్యామ్‌ ‌నిర్మించలేదని ఆరోపించారు. ఎనిమిదేళ్లలో 15 చెక్‌డ్యామ్‌లు కట్టామన్నారు. డబుల్‌ ఇం‌జిన్‌ ‌సర్కారున్న కర్నాటకలో పరిస్థితి ఏంటని ఈ సందర్భంగా మంత్రి ప్రశ్నించారు. కర్ణాటకలో రూ.1400కు క్వింటాల్‌ ‌వడ్లు కొంటే.. తెలంగాణలో రూ.1920కి కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు. కర్నాటక రైతులు రాష్టాన్రికి ధాన్యం తెచ్చి అమ్ముకుంటున్నారన్నారు.

తెలంగాణలోని సంక్షేమ పథకాలు కర్నాటకలో లేవన్నారు. వడ్లు కొనుగోలు చేయకుండా కేంద్రం మోసం చేసిందని ఆరోపించారు. రైతులు ఇబ్బంది పడొద్దని ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసిందన్నారు. పార్లమెంట్‌లో ఇచ్చిన వరంగల్‌ ‌కోచ్‌ ‌ఫ్యాక్టరీ హా ఏమైందని, తెలంగాణకు రావాల్సిన రైల్వే కోచ్‌ ‌ఫ్యాక్టరీ గుజరాత్‌ ‌వెళ్లిందన్నారు. ఆర్థిక సంఘం నివేదికను కేంద్రం తొక్కిపెట్టిందని,

తెలంగాణకు రూ.9వేలకోట్ల ఎగనామం పెట్టిందని, నీతి ఆయోగ్‌ ‌సూచనలు ఎందుకు పాటించడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ గుండెచప్పుడు కేసీఆర్‌ అన్నారు. నర్సాపూర్‌లో త్వరలో టూరిస్ట్ ‌హబ్‌, ‌పీజీ కాలేజీకి పక్కా భవనం నిర్మిస్తామన్నారు. రూ.35కోట్లు మంజూరు చేశామని, మల్లన్నసాగర్‌ ‌నీళ్లు నర్సాపూర్‌ ‌వస్తాయని, కాలంతో పని లేకుండా నీళ్లు వచ్చేలా చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వంపై మంత్రి హరీష్‌రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. బుధవారం ఆయన డియాతో మాట్లాడుతూ కేంద్రానికి ఎప్పుడూ ఏదో సంస్థను అమ్మాలనే ఆలోచనే ఉందని తప్పుబట్టారు. కేంద్ర ప్రభుత్వానిది వ్యాపార ధోరణెళినని దుయ్యబట్టారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తే ఆర్టీసీ అమ్మేయడం ఖాయమన్నారు. డబుల్‌ ‌డెక్కర్‌ ‌గవర్నమెంట్‌ ఉన్న చోట్ల 6 గంటలు మాత్రమే విద్యుత్‌ ‌సరఫరా చేస్తున్నారని తెలిపారు. సంస్థలను అమ్మడం కాదని, కొత్తవి ఏర్పాటు చేయాలని డిమాండ్‌ ‌చేశారు. తెలంగాణకు రావాల్సిన కోచ్‌ ‌ఫ్యాక్టరీని గుజరాత్‌కు తీసుకెళ్లారని, రాష్టాన్రికి ఇవ్వాల్సిన రూ.9 వేల కోట్లను కేంద్రం ఇవ్వలేదని హరీష్‌రావు విమర్శించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *