బిజెపి అభ్యర్థి గెలుపుకోసం కార్యకర్తలతో కలసి ప్రచారం నిర్వహించించిన మాదాపూర్ ఉపసర్పంచ్ శ్రీకాంత్ గౌడ్
కందుకూరు,ప్రజాతంత్ర,నవంబర్ 27 : నియోజకవర్గ పరిధిలోని కందుకూరు మండలంలో బిజెపి అభ్యర్థి గెలుపుకోసం కార్యకర్తలతో కలసి మాదాపూర్ లో ఆగ్రామ ఉపసర్పంచ్,కందుకూరు మండల బిజెపి అధికార ప్రతినిధి శ్రీకాంత్ గౌడ్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ,ఈ ఎన్నికల్లో బిజెపి అధికారంలోకి వస్తే ఏడాదికి 4 సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్నారు.పేధప్రజలకు న్యాయం జరగాలంటే కేవలం బిజెపి ద్వారానే సాద్యపడుతుండని ఆయన పేర్కొన్నారు.విద్యా,వైద్యంతో పాటు ప సంక్షేమ పతకాలు అందిస్తామని అన్నారు.ఈనెల 30న జరిగే ఎన్నికల్లో పువ్వు గుర్తుకు ఓటు వేసి తమ అభ్యర్థిని గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు.ప్రచార కార్యక్రమంలో బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు.





