బిజెపి అభ్యర్థి ఆచారి కి అడుగడుగునా జననిరాజనం

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 19 :  కల్వకుర్తి నియోజకవర్గ బిజెపి అభ్యర్థి తల్లోజు ఆచారి కి ప్రజలు అడుగడుగున నిరాజనం పలుకుతున్నారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయినా ప్రజల మధ్యనే ఉంటూ వారి కోసం అనేక ఉద్యమాలు చేసి ప్రభుత్వాలపై పోరాడారని ఆరోసారి మీ ముందుకు వస్తున్న తనను ఆశీర్వదించి కల్వకుర్తిని అభివృద్ధి పరచుకోవాలని ఆచారి వేడుకుంటున్నారు. ఇందులో భాగంగా గురువారం కడ్తాల్ మండలంలోని బాలాజీ నగర్ తాండ, రేకులకుంట తాండా, సాలార్ పూర్, చల్లంపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈకార్యక్రమంలో ఆమనగల్లు జడ్పీటీసీ కండే హరిప్రసాద్, మాజీ ఎంపీపీ వీరయ్య, ఎక్వయిపల్లి సర్పంచ్ సాయిలు, కడ్తాల్ మండల అధ్యక్షుడు మాన్య నాయక్, రంగారెడ్డి జిల్లా అధికార ప్రతినిధి రాందాస్, గిరిజన మోర్చా ఎన్నికల అధ్యక్షుడు రెడ్య నాయక్, భగిరథ్, వెంకటేష్, లక్ష్మణ్, రమేష్ యాదగిరి, బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *