బిజెపిలో చేరిన వివిధ పార్టీల నాయకులు 

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 31 : కల్వకుర్తి బిజెపి అభ్యర్థి గెలుపుకుతామంతా కృషి చేస్తామని కోరుతూ వివిధ పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు బిజెపిలో చేరారు. తలకొండపల్లి ఖానాపూర్ గ్రామపంచాయతీలోనీ కర్కాస్ తండా, పాతకోట, గౌరీపల్లి ,గౌర్విపల్లి తాండ, బలుసుల పల్లి తండా, ఆర్లకుంట తండాలకు చెందిన సుమారు 200 మంది ఆచారి సమక్షంలో బిజెపి పార్టీలో చేరారు. వారిని కండువా కప్పి పార్టీలోకి ఆచారి ఆహ్వానించారు. కల్వకుర్తి నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేసే నాయకుడని కమలం గుర్తుకు ఓటు వేసి ఆయన్ని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో పాల్గొన్న నాయకులు మాజీ తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్ డైరెక్టర్ సామా బ్రదర్స్ తిరుమలరెడ్డి, మల్లారెడ్డి, మాజీ అమనగగల్లు జడ్పీటిసి కండె హరిప్రసాద్, ఎంపీటీసీ రాజు, ఆమనగల్ మున్సిపాలిటీ చైర్మన్ రాంపాల్ నాయక్, వైస్ చైర్మన్ దుర్గయ్య, తలకొండపల్లి ఎంపిటిసి హేమారాజు శ్రీశైలం, తలకొండపల్లి మండల అధ్యక్షుడు రవి శ్యానముని పాండు, నీలకంఠం పాండు, కుమార్, మహేష్ బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *