ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 23 : కడ్తాల మండలం పెద్దిరెడ్డి చెరువు తండాలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు సుమారు 50 మంది బీజేపీ పార్టీలో చేరారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వ పథకాలకు ఆకర్షితులై బిజెపి అభ్యర్థి ఆచారి గెలుపుకు తామందరం కృషి చేస్తామన్నారు. ఈ సమావేశంలో కర్ణాటక ఎమ్మెల్యే కృష్ణా నాయక్, కర్ణాటక బిజెపి ఉపాధ్యక్షులు, జాతీయ బీసీ కమిషన్ ఉపాధ్యక్షులు లోకేష్ ప్రజాపతి సమక్షంలో చేరినట్లు బిజెపి మండల అధ్యక్షుడు మన్యా నాయక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ వీరయ్య, రమేష్, మోహన్ రెడ్డి, మహేష్, యాదగిరి, రాందాస్ తదితరులు పాల్గొన్నారు.
బిజెపిలో చేరిన వివిధ పార్టీల నాయకులు




