బిజెపిలో చేరిన బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 26 :  కడ్తాల్ మండలం గోవిందాయపల్లి, అన్మాస్ పల్లి, గానుగుమర్ల తండా కు చెందిన బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు సుమారు 100 మంది బిజెపిలో చేరారు. ఈ సందర్భంగా వారిని కల్వకుర్తి బిజెపి అభ్యర్థి ఆచారి బిజెపి కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆచారి గెలుపే లక్ష్యంగా పని చేస్తామని భరోసా ఇచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వం లో కలిసి కట్టుగా కల్వకుర్తి అభివృద్ధి కి పాటు పడి  మాజీ జాతీయ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారిని గెలిపించుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఆమనగల్లు మాజీ జడ్పీటిసి కండె హరిప్రసాద్, కడ్తాల్ మండల అధ్యక్షులు మన్య నాయక్, గిరిజన మోర్చా అధికార ప్రతినిధి రాందాస్ నాయక్, గిరిజన మోర్చా ప్రధాన కార్యదర్శి సాయిలాల్ నాయక్, రాష్ట్ర గిరిజన మోర్చా ఎన్నికల కమిటీ నాయకుడు రెడ్య నాయక్, మండల బిజెపి పార్టీ ప్రధాన కార్యదర్శి జంగం వెంకటేష్, గడ్డం వెంకటేష్, శ్రీశైలం, సందీప్, అల్లాజి, కేకే శ్రీను, శ్రీకాంత్ సింగ్, రవిరాథోడ్ బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *