షాద్ నగర్ ప్రజా తంత్ర నవంబర్ 04: షాద్ నగర్ నియోజకవర్గంలోని కొత్తూరు మండలం లోని తిమ్మాపూర్ గ్రామం లో బిజెపి మ్మెల్యే అభ్యర్థి శ్రీ అందె బాబయ్య మద్దతుగా ఈరోజు నాగరాజు చారి అధ్యక్షతన ప్రచారం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో *బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి,ఈ సందర్బంగా అందె బాబయ్య మాట్లాడుతూగ్రామాల అభివృద్ధి మోడీ ప్రభుత్వం తోనే సాధ్యమని అన్నారు.కరోనా సమయం లో ఉచితంగా టీకాలు ఇచ్చి 130 కోట్ల ప్రజల ప్రాణాలు కాపాడరని మరియు కరోనా సమయం నుండి ఇప్పటి వరకు ఉచిత రేషన్ ద్వారా నిరుపేద ప్రజలను ఆదుకున్నారని అన్నారు.గ్రామాలలో వీధి లైట్లు, సీసీ రోడ్లు, పల్లె ప్రకృతి వనాలు మోడీ నిధుల తోనే జరుగుతున్నాయని అన్నారు.బి ఆర్ ఎస్ ప్రభుత్వం తొమ్మిదిన్నర పాలన లో దళితులను, రైతులను, గిరిజనులను, నిరుద్యోగులను, ప్రభుత్వ ఉద్యోగాలను అన్ని వర్గాల ప్రజలను దగా చేసిందని అన్నారు.షాద్ నగర్ లో కాంగ్రెస్ కు అవకాశం ఇచ్చారు, బి ఆర్ఎస్ కు అవకాశం ఇచ్చారు ఏమీ అభివృద్ధి చేయలేదని, ఒక్క సారి బిజెపి కి అవకాశం ఇవ్వండని అన్నారు.షాద్ నగర్ ఎమ్మెల్యే గా నన్ను గెలిపించండి, ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పించండని అన్నారు.షాద్ నగర్
ప్రజల ఆకాంక్షల కు అనుగుణంగా పని చేస్తానని, షాద్ నగర్ అభివృద్ధి చేస్తానని అన్నారు.గత ప్రభుత్వాలు షాద్ నగర్ అభివృద్ధి చేయడం లో వైఫల్యం చెందాయని అన్నారు.కాంగ్రెస్,బి ఆర్ ఎస్ పార్టీ లు రెండూ ఒకటేనని విమర్శించారు.కాంగ్రెస్ కు ఓటేసినా బి ఆర్ఎస్ కు వేసినట్టే, బి ఆర్ఎస్ కు ఓటేసినా కాంగ్రెస్ కు ఓటేసినట్టే అని అన్నారు.ఈ రెండు పార్టీ ల విధానాలు ఎంఐఎం విధానాలకు అనుగుణంగా పనిచేస్తాయని, ఈ రెండుపార్టీ ల హామీలను నమ్మి ప్రజలు మళ్ళీ మోసపోవద్దని అన్నారు.అణగారిన వర్గాల కోసం మోడీ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారని, అవి మనకు అందకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటుందని మండి పడ్డారు.డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే మోడీ పథకాలు మనకు అందుతాయని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నెల్లి శ్రీ వర్ధన్ రెడ్డి అన్నారు షాద్ నగర్ అభివృద్ధి కేవలం బిజెపి తోనే సాధ్యమని అన్నారు.బిజెపి కి ఓటేసి బడుగు బలహీన వర్గాల ఆషాజ్యోతి అందె బాబన్న భారీ మెజార్టీ తో గెలిపించుకుందామని అన్నారు.ఈ కార్యక్రమం లోయుగేందర్, శివకృష్ణ, సురేష్, వివేక్, అభిలాష్, కొంకళ్ళ మణికంఠ, రవి నాయక్ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.





