బిఆర్ఎస్ వారికే దళితబందు ఇస్తాం ఎవరికైనాచెప్పుకొండి

కందుకూరు,ప్రజాతంత్ర,అక్టోబర్ 3 : ఉన్నవారికి దళిత బంధిస్తున్నారని అడిగితే దురుసుగా ప్రవర్తిస్తున్న సర్పంచ్ ఎర్ర బైరు సదాలక్ష్మి పుల్లారెడ్డి దురుసుగా ప్రవర్తిస్తున్నారని అందుకు నిరసనగా మంగళవారం రంగారెడ్డి జిల్లా కార్యాలయం ముందు జైత్వారం గ్రామానికి చెందిన దళితులు 50 మందితో ధర్నా నిర్వహించారు.దళిత బంధు పథకం లేనివారికి ఇవ్వాలి తప్ప ఉన్నవారికి ఇవ్వడం ఏమిటని గ్రామస్తులు సర్పంచ్ ను ప్రశ్నించగా ఆమె భర్త పుల్లారెడ్డి తమకు అనుకూలంగా ఉండే వారికే దళిత బంధు ఇస్తున్నామని మీకెందుకు ఇయ్యాలని దళితులపై దురుసుగా ప్రవర్తించడమే కాక మీరు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అని కరాకండిగా చెప్పడం జరిగిందని దళితులు తెలిపారు.రెండో విడతలో  పేదలను చూడకుండా ఆస్తులు ఉన్నవారికి మాత్రమే ఇస్తున్నారని వారు వాపోయారు. ప్రభుత్వం పేద దళితుల పట్ల దళిత బంధు ప్రకటించారే తప్ప ఉన్నవారికి ఇవ్వాలని ఎలాంటి నియమ నిబంధనలు లేవని వారు పేర్కొన్నారు.అందుకు నిరసనగా జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి జిల్లా జాయింట్ కలెక్టర్ భూ పాల్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు.ఒకవేళ పేదలైన దళితులకు దళిత బంధు ఇవ్వకుంటే వచ్చే ఎన్నికల్లో ముక్కుమ్మడిగా బిఆర్ఎస్ పార్టీని మాదళిత వర్గాలు జైత్వా రం గ్రామంలో బహిష్కరించి తీరుతామని గ్రామస్తులు శపథం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *