బిఆర్ఎస్ లో చేరిన సత్యం సాగర్

కీసర, ప్రజాతంత్ర , నవంబర్ 18 : తెలంగాణ సాగర సంగం ప్రధాన కార్యదర్శి, మాజీ వార్డ్ మెంబర్  గౌరక్క సత్యం సాగర్ నాగారం మున్సిపాలిటీ చైర్మన్ కౌకుంట్ల చంద్రారెడ్డి ఆధ్వర్యంలో  మంత్రి చామకూర మల్లారెడ్డి సమక్షంలో  శనివారం బిఆర్ఎస్ పార్టీలో చేరారు. సత్యం సాగర్ తో పాటు సుమారు 100 మంది  సాగరం సంఘం  సభ్యులు చేరారు. మంత్రివారికి  గులాబీ కండువా కప్పి   పార్టీలోకి ఆహ్వానించారు.  మంత్రి మాట్లాడుతూ  బిఆర్ఎస్ అభివృద్ధి, సంక్షేమ పథకాలు  నచ్చి పార్టీలో చేరుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు తెల్ల  శ్రీధర్,  వైస్  చైర్మన్ మల్లేష్ యాదవ్, కౌన్సిలర్లు బిజ్జ శ్రీనివాస్ గౌడ్, కౌకుంట్ల   అనంతరెడ్డి వెంకట్ రెడ్డి, కోఆప్షన్ సభ్యులు  ఆదం షఫీక్, బిఆర్ఎస్ నాయకులు  గూడూరు ఆంజనేయులు గౌడ్, శిలా సాగరం నాగేందర్, కౌకుంట్ల కృష్ణారెడ్డి, జగన్మోహన్ రెడ్డి, కొమురెల్లి సుధాకర్ రెడ్డి, నిమ్మల శ్రీను, కిష్టన్నగారి లింగం, బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *