ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 9 : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బిఆర్ఎస్ మున్సిపాలిటీ అధ్యక్షుడు పత్యానాయక్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున గులాబీ కండువా కప్పుకున్నారు. మున్సిపాలిటీ లోని ఆరో వార్డు,15వ వార్డు,12వ వార్డుకు చెందిన యూత్ ప్రెసిడెంట్ వడ్డే వెంకటేష్, పూసలసత్యం, మద్దూరి ఆనంద్ ల ఆధ్వర్యంలో వచ్చి గులాబీ కాండువ కప్పుకున్నట్టు వారు పేర్కొన్నారు.


