బిఆర్ఎస్ లోకి బీజేపీ నాయకుల భారీగా చేరికలు

తాండూరు ప్రజాతంత్ర నవంబర్ 8: బీజేపీ నాయకులు బుధవారం భారీ సంఖ్యలో బిఆర్ఎస్ పార్టీ లో చేరారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డ్ సమక్షంలో నియోజకవర్గ వ్యాప్తంగా యువకులు,బీజేపీ నాయకులు బిఆర్ఎస్ లో చేరారు. నియోజకవర్గం లోని యాలాల, బషీరాబాద్, తాండూరు మండలం లోని పలువురు నాయకులు, యువకులు బుధవారం ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. బిజేపి ఓబీసీ సెల్ అధ్యక్షుడు తిరుపతయ్య, కమిటీ సభ్యుడు మోహన్ రెడ్డి, సంగెం కలాన్ కాంగ్రెస్ నాయకులు వడ్డే బాస్వరజ్ తదితరులు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి చేసిన అభివృద్ధి కార్యక్రమాలను చూసి తాండూరు అభివృద్ధి కి రోహిత్ రెడ్డి నే సరైన వ్యక్తి అని, యువకులం అందరం రోహిత్ రెడ్డి వెంటే ఉంటామని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *