శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, నవంబర్ 4: అభివృద్ధి సంక్షేమ పథకాలు బిఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని ప్రభుత్వ విప్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. ఈ మేరకు ఆయన శనివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా శేర్లింగంపల్లి డివిజన్ పరిధిలోని పాపిరెడ్డి కాలనీ, రాజీవ్ స్వగృహ, రాజీవ్ గృహకల్ప, సురభి కాలనీలలో కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్ తో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ తొమ్మిది వేల కోట్ల రూపాయల నిధులతో శేర్లింగంపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి చేశామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ మరొకసారి తనను గెలిపిస్తే మిగిలి ఉన్న సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి తోడ్పడే విధంగా మ్యానిఫెస్టో ఉందని, సబ్బండ వర్గాల ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని ప్రజలు బిఆర్ఎస్ పార్టీని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని రాబోయే ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించడం కాయమన్నరు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
బిఆర్ఎస్ పాలనలోనే అభివృద్ధి సంక్షేమ పథకాల సాధ్యం. ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ





