ఆమనగల్లు, ప్రజాతంత్ర జులై 31. కొంతమంది బిఆర్ఎస్ పార్టీ నాయకులు పార్టీ విధానాలకు వ్యతిరేకంగా ఒక ఫామ్ హౌస్ లో సమావేశమై పార్టీ అధిష్టానం ఆదేశాలను ధిక్కరించి వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని వారిపై బిఆర్ఎస్ పార్టీ అధిష్టానం కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు బిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు నాయకులు కోరారు. సోమవారం స్థానిక విలేకరులకు ప్రకటన విడుదల చేశారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి వర్గం అని చెప్పుకునే కొంతమంది నాయకులు, ప్రజా ప్రతినిధులు కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కు టికెట్ వస్తే ఆయన ఓటమే ధ్యేయంగా పనిచేస్తామని చెప్పడం పార్టీ ఆదేశాలు ధిక్కరించినట్టేనని వారన్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన జైపాల్ యాదవ్ ను రాజకీయంగా దెబ్బ కొట్టాలనే దుర్బుద్ధితో చిల్లర రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు అన్నారు. ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్న కట్టుబడి ఉండి పార్టీ అభ్యర్థిని గెలిపించుకుంటారని వారన్నారు. ఎమ్మెల్యే ఎప్పుడు ఎన్నడు పార్టీకి వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ లేదని అన్నారు. కానీ పార్టీ వ్యతిరేక విధానాలు ఆలంబిస్తున్న కొంతమంది నాయకులకు ఆయన గురించి తెలియక ఇలాంటి చిల్లర రాజకీయం చేస్తున్నారునీ ఆరోపించారు. ఆ ఫామ్ హౌస్ సమావేశంలో బి ఆర్ ఎస్ పార్టీకి సంబంధం లేని వ్యక్తులు కూడా పాల్గొనడం జరిగిందనీ వారన్నారు. కనుక వీరిపై పార్టీ అధిష్టానం కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఆమనగల్లు మండల వైస్ ఎంపీపీ జక్కు అనంతరెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు నిట్ట నారాయణ, ఎంపిటిసి దోనాదుల కుమార్, బిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి గండికోట శంకర్, ఉపాధ్యక్షుడు పరమేష్, నాయకులు ఖలీల్, వర్కింగ్ ప్రసిడెంట్ నిరంజన్, డైరెక్టర్ రమేష్, రైతు సంఘం అధ్యక్షులు వెంకట్ రెడ్డి, యూత్ వింగ్ అధ్యక్షులు వడ్డే వెంకటేష్, వంకేశ్వరం భీమయ్య, మున్సిపాలిటీ బి ఆర్ ఎస్ కార్యదర్శి వడ్డేమోని శివకుమార్, కొమ్ము ప్రసాద్, కిరణ్, రంజిత్ అబ్బు, విక్రమ్, శివ, విజయ్ కార్తీక్, రమేష్, తదితరులు పాల్గొన్నారు.




