బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకుందాం

మహేశ్వరం, ప్రజాతంత్ర అక్టోబర్ 31: వచ్చే నెల 30న జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మహేశ్వరం నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ప్రతి ఒక్కరు కారు గుర్తుకు ఓటు వేసి, భారీ మెజారిటీతో గెలిపంచుకోవాలని బిఆర్ఎస్ అధికార ప్రతినిధి పట్లోళ్ల కార్తీక్ రెడ్డి పిలుపు నిచ్చారు. మంగళవారం మహేశ్వరం నియోజకవర్గం  బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ నాదర్గుల్ బిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కార్తీక్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్తీక్ రెడ్డి  మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కారు గుర్తుపై ఓటు వేసి  మహేశ్వరం నియోజకవర్గం అభివృద్ధి ప్రదాత సబితా ఇంద్రారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. రాష్ర్టంలో మరోసారి వచ్చేది బిఆర్ఎస్ ప్రభుత్వమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక బిఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, గులాబీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *