బిఆర్‌ఎస్‌ ‌పార్టీకి భారీ షాక్‌…

•‌ కాంగ్రెస్‌లో చేరిన బిఆర్‌ఎస్‌ ఎం‌పీపీ, అనుచర గణం
• నియంతృత్వ పాలన కారణంగానే బయట కొచ్చాం…
• కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన డీసీసీ అధ్యక్షులు రామ్మోహన్‌ ‌రెడ్డి

పరిగి, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 30 : ‌బిఆర్‌ఎస్‌ ‌పార్టీలో నియంతృత్వ పరిపాలన కొనసాగుతుందని దోమ మండలంలో అది మరీ ఇంకా ఎక్కువగా ఉందని పరిగి మాజీ ఎమ్మెల్యే వికారాబాద్‌ ‌జిల్లా డిసిసి అధ్యక్షులు రామ్మోహన్‌ ‌రెడ్డి అన్నారు. శనివారం దోమ మండల ఎంపీపీ అనసూయ, ఎంపీటీసీ బంగ్లా అనిత యాదయ్య గౌడ్‌ ‌తన అనుచర గనంతో కలిసి అధికార టిఆర్‌ఎస్‌ ‌పార్టీని వీడి కాంగ్రెస్‌ ‌పార్టీలో చేరడం జరిగింది. పరిగి పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే నివాసంలో కార్యక్రమం ఏర్పాటు చేసి డిస అధ్యక్షులు పరిగి మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్‌ ‌రెడ్డి వారికి కాంగ్రెస్‌  ‌కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం  డీసీసీ అధ్యక్షులు,మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ… రానున్న రోజుల్లో కాంగ్రెస్‌ ‌పార్టీ అధికారంలోకి వస్తుందని, కాంగ్రెస్‌ ‌పార్టీతోనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యపడుతుందని అన్నారు. కాంగ్రెస్‌ ‌యొక్క విధి విధానాలు నచ్చే పార్టీకి ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని అన్నారు. అధికార బిఆర్‌ఎస్‌ ‌పార్టీలో ఎమ్మెల్యే మహేష్‌ ‌రెడ్డి, దోమ మండల జడ్పిటిసి నాగిరెడ్డిల నియంత వైఖరి కారణంగా సామాన్య ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు అని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలులో విఫలమైందని అన్నారు. అనంతరం దోమ మండల ఎంపీపీ తనయుడు రాఘవేందర్‌ ‌రెడ్డి మాట్లాడుతూ… దోమ మండలంలో ప్రజలు స్వేచ్ఛగా బ్రతకడం లేదని, ప్రతి ఒక్కరూ బానిసలుగా జీవనం కొనసాగించాల్సిన దురదృష్టం ఏర్పడిందని అన్నారు. బానిస సంకెళ్లు తెంచుకొని బయటికి వచ్చామని ప్రతి ఒక్కరూ బయటికి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. బిఆర్‌ఎస్‌ ‌పాలనలో పాలనలో ప్రజలకు మేలు జరగలేదని బీఆర్‌ఎస్‌ ‌పాలనలో పేద ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని కాంగ్రెస్‌ ‌పార్టీ వల్లనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని నమ్మి ఈరోజు మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్‌ ‌రెడ్డి  గెలుపు పరిగి నియోజకవర్గానికి అత్యంత అవసరమని అందువల్లనే బీఆర్‌ఎస్‌ ‌పార్టీనీ వదిలి కాంగ్రెస్‌ ‌లో చేరామని తెలిపారు.

దోమ మండల ఎంపీపీ పటోల్ల అనుసూయ, జిల్లా గ్రంథాలయ డైరెక్టర్‌ ‌బంగ్లా యాదయ్య గౌడ్‌,‌బిఆర్‌ఎస్‌ ‌పార్టీ మాజీ మండల అధ్యక్షులు పటోళ్ల రాఘవేందర్‌ ‌రెడ్డి, దోమ ఎంపీటీసీ బంగ్లా అనిత, బుద్లాపూర్‌  ‌మాజీ సర్పంచ్‌ ‌మాధవులు, కొండయ్య పల్లి సర్పంచ్‌ ‌తనయుడు ప్రసాద్‌ ‌గౌడ్‌,‌పిఏసిఎస్‌ ‌మాజీ చైర్మన్‌ ‌రామచంద్రారెడ్డి,ఊట్పల్లి మాజీ ఉపసర్పంచ్‌ ‌వెంకటయ్య గౌడ్‌, ‌రాకుండా మాజీ సర్పంచ్‌ ‌చాపల వెంకటయ్య, బాచుపల్లి కావటి శ్రీనివాస్‌,‌మైలారం మాటరి నర్సింలు, కొండాయిపల్లి మహిపాల్‌ ‌రెడ్డి, బడేంపల్లి మంచలి రాజు, పరిగి యునుస్‌, ‌దోమ, కిష్టాపూర్‌, ‌బుద్లపూర్‌ ‌బ్రాహ్మణపల్లి, దిర్సంపల్లి, కొండాయిపల్లి, దాదాపూర్‌, ఐనాపూర్‌,  ‌మైలారం, బాస్పల్లి, పరిగి పట్టణం, కుసుమ సముద్రం,  రాకొండ, పోతిరెడ్డిపల్లి, తిమ్మాయిపల్లి ఊటుపల్లి తదితర  గ్రామాల బిఆర్‌ఎస్‌ ‌పార్టీ అధ్యక్షులు ,ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు అందరూ సుమారు 2000 వేల మంది పార్టీలో చేరడం జరిగింది.

ఈ కార్యక్రమంలో దోమ మండలం పార్టీ అధ్యక్షులు విజయ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి, పట్టణ అధ్యక్షులు ఎర్రగడ్డ పల్లి కృష్ణ మండల అధ్యక్షులు సురేందర్‌ ‌ముదిరాజ్‌ ‌నారాయణ ఆంజనేయులు జితేందర్‌ ‌రెడ్డి వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌శాంతు కుమార్‌, ‌రాములు నాయక్‌, ‌యాదవ్‌ ‌రెడ్డి, ప్రభాకర రెడ్డి, సత్యనారాయణ, శేష రెడ్డి, భీమ్‌ ‌రెడ్డి, నర్సింహ చారీ, రాజు, వెంకటయ్య, బాల్‌ ‌రెడ్డి,  కవిత, అశోక్‌ ‌రెడ్డి, లాల్‌ ‌కృష్ణ, అనంతయ్య, జగన్‌, ‌రియాజ్‌, ‌శ్రీనివాస్‌, ‌మల్లేష్‌, ఆం‌జనేయులు, చిన్న నర్సింలు, వెంకట్‌ ‌రామ్‌ ‌రెడ్డి, షోయబ్‌, ‌పెంటయ్య, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *