బిఆర్ఎస్ తోనే అభివృద్ధి సంక్షేమం

కీసర, ప్రజాతంత్ర ,  నవంబర్ 25 :  మేడ్చల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి  మంత్రి  చామకూర మల్లారెడ్డి కి మద్దతుగా బిఆర్ఎస్ నాయకులు శుక్రవారం ప్రచారం నిర్వహించారు.16వ వార్డులో బి ఆర్ఎస్ నాయకులు మనోహర్ రెడ్డి, అక్బర్ బాషా,   నరేందర్ రెడ్డి, వెంకన్న,  రామచంద్రారెడ్డి, ఓం ప్రకాష్  ప్రచారం చేశారు .  వారు మల్లారెడ్డిని    గెలిపించాలని   ఇంటింటికి   నిర్వహించి,    కారు  గుర్తుకు ఓటు వేసి బిఆర్ఎస్  అభ్యర్థిని     భారీ  మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  ప్రజలు  కేసీఆర్    నాయకత్వాన్ని ప్రజలు  కోరుకుంటున్నారని అన్నారు.  ప్రతిపక్ష  పార్టీల నాయకుల మాటలను   ప్రజలు నమ్మరని తెలిపారు.  బిఆర్ఎస్   తోనే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని  ప్రజలు నమ్ముతున్నారని  అన్నారు.  ప్రచార సమయంలో  ప్రజలు  బిఆర్ఎస్  బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు.  అభివృద్ధి,  సంక్షేమ పథకాలలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు.  రాష్ట్రంలో బిఆర్ఎస్ హ్యాట్రిక్, మల్లారెడ్డి మరోసారి విజయం  ఖాయమన్నారు. బి ఆర్ఎస్ తోనే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. బిజెపి, కాంగ్రెస్ హయాంలో రాష్ట్రం అభివృద్ధి చెందలేదు అన్నారు. కార్యక్రమంలో  బిఆర్ఎస్  పార్టీ నాయకులు   పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *