బిఆర్‌ఎస్‌ ఎంఎల్‌ఏ ‌పైలెట్‌ ‌రోహిత్‌ ‌రెడ్డి, హీరోయిన్‌ ‌రకుల్‌లకు ఇడి సమన్లు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 16 : ‌బిఆర్‌ఎస్‌ ఎంఎల్‌ఎ ఎమ్మెల్యే పైలట్‌ ‌రోహిత్‌రెడ్డి, టాలీవుడ్‌ ‌హీరోయిన్‌ ‌రకుల్‌ ‌ప్రీత్‌ ‌సింగ్‌లకు ఈడీ శుక్రవారం నోటీసులు ఇచ్చింది. టాలీవుడ్‌ ‌డ్రగ్స్ ‌కేసులో వీళ్లిద్దరికీ నోటీసులిచ్చినట్లు తెలుస్తుంది. ఈనెల 19న విచారణకు హాజరుకావాలని అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. ఈడీ నోటీసులపై ఎమ్మెల్యే పైలట్‌ ‌రోహిత్‌రెడ్డి స్పందిస్తూ..నోటీసులు అందాయని తెలిపారు. తన వ్యాపారాలు, కంపెనీలకు సంబంధించిన వివరాలు అడిగారని చెప్పారు.

19న ఈడీ విచారణకు హాజరవుతానని చెప్పారు. 2021 ఫిబ్రవరిలో కర్ణాటక రాజధాని బెంగళూరులో పట్టుబడిన డ్రగ్స్‌తో పైలట్‌ ‌రోహిత్‌ ‌రెడ్డికి సంబంధాలున్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు. భారీగా నగదు చేతులు మారిన నేపథ్యంలో కేసును ఈడీకి అప్పగించారు. ఈ నేపథ్యంలోనే రోహిత్‌ ‌రెడ్డికి నోటీసులు అందినట్లు తెలుస్తుంది. ఆధార్‌, ‌వోటర్‌ ఐడితో సహా ఆర్థిక లావాదేవీల పత్రాలను తీసుకోని రమ్మన్నారని వెల్లడించారు. కేసు వివరాలు లేకుండా ఇచ్చిన నోటీసుల పై లీగల్‌ ‌టీంతో పరిశీలిన చేస్తాని రోహిత్‌ ‌స్పష్టం చేశారు. లీగల్‌ ఒపీనియన్‌ ‌తీసుకున్న తరువాతే నోటీసులపై స్పందిస్తానని పైలెట్‌ ‌రోహిత్‌ ‌రెడ్డి పేర్కొన్నారు. ఇక గతంలో రకుల్‌ ఈడీ విచారణకు హాజరైన విషయం తెలిసిందే. అత్యవసరంగా వెళ్లాల్సి ఉందని గతంలో విచారణ మధ్యలోనే రకుల్‌ ‌వెళ్లిపోయింది. దీంతో మరోసారి విచారణకు హాజరుకావాలని రకుల్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *