తాండూరు, ప్రజాతంత్ర, నవంబర్ 1: బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి తాండూరు నియోజకవర్గం లోని విశ్వకర్మలు తమ మద్దతును తెలియజేశారు. బుధవారం తాండూర్ నియోజకవర్గం లోని విశ్వకర్మలు పెద్ద ఎత్తున గాజీపూర్ మాజీ సర్పంచ్,మండల మాజీ సర్పంచుల సంఘం అధ్యక్షులు రవికుమార్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశ్వకర్మలకు అన్ని విధాలుగా సహకరించాలని, బిసి బంధు నియోజకవర్గంలోని అన్ని కుటుంబాలకు వచ్చేలా చూడాలని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ని కోరారు. విశ్వకర్మలకు ఎప్పుడు ఏ చిన్న సమస్య ఉన్న తక్షణమే స్పందిస్తానని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి హామీ ఇచ్చారు.విడతల వారిగా అన్ని కుటుంబాలకు బిసి బంధు వస్తుందని హామీ ఇచ్చారు. అనంతరం నూతనంగా ఎన్నికైన తాండూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గద్దె వీణా శ్రీనివాస్ చారి ని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సమక్షంలో విశ్వకర్మలు ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో తిప్పన్న చారి, నర్సింలు, రవీందర్, ప్రభాకర్, వెంకటేశం, విష్ణు,కృష్ణ చారి, బ్రహ్మయ్య చారి,రఘు చారి, సుబ్బన్న, సంగమేశ్వర్, సంజీవ్ చారి, మనోహర్,జగదీశ్వర్ మరియు పెద్ద ఎత్తున తాండూర్ నియోజకవర్గంలోని విశ్వకర్మలు పాల్గొన్నారు.
బిఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి కి మద్దతు తెలిపిన విశ్వకర్మలు




