- దేశం మార్పు కోరుకుంటుంది
- అన్ని రంగాల్లో అగ్రగామిగా తెలంగాణ
- మహారాష్ట్రను అన్ని పార్టీలు పాలించినా వెనకబాటే
- కొత్త ఉదయం దిశగా..క్రాంతి మార్గంలో నడవాలి
- కొరియా, జపాన్ లాంటి దేశాలు పురోగమిస్తుంటే చూడాలా
- అబ్‌కీ బార్ కిసాన్ సర్కార్ మా నినాదం
- సర్కోలి సభలో సిఎం కెసిఆర్ ఉద్ఘాటన
హైదరాబాద్, జూన్ 27 : తెలంగాణలో అన్ని రంగాల్లో అభివృద్ధి కనిపిస్తూంటే..మహారాష్ట్రలో మాత్రం ఆ పరిస్థితి లేదని సిఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణలా మహారాష్ట్ర కూడా అభివృద్ధి చెందాల్సి ఉందన్నారు. అన్ని వనరులు ఉన్న మహారాష్ట్ర ఇంకా ఎక్కువ ఎందుకు అభివృద్ధి చెందకూడదని ప్రశ్నించారు. టిఆర్‌ఎస్ పార్టీ బిఆర్‌ఎస్‌గా అవతరించిన తరువాత ఇతర రాష్ట్రాల్లో పార్టీ విస్తరణలో భాగంగా మంగళవారం సోలాపూర్ జిల్లాలోని సర్కోలీ గ్రామంలో బీఆర్‌ఎస్ పార్టీ నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ…బీఆర్‌ఎస్ అంటే భారత్ పరివర్తన్ పార్టీ అని కొత్త అర్థం చెప్పారు. భారత్‌కు స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచిపోయాయన్నారు. దేశాన్ని కాంగ్రెస్ దాదాపుగా యాభై ఏళ్లు పరిపాలించిందన్నారు. మహారాష్ట్ర ప్రజలు కాంగ్రెస్, శివసేన, బీజేపీకి పలుమార్లు అవకాశం ఇచ్చారని కానీ అనుకున్న విధంగా అభివృద్ధి జరగలేదన్నారు. తెలంగాణలో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధ్యమైనప్పుడు అన్ని వనరులు ఉన్న మహారాష్ట్రలో ఎందుకు సాధ్యం కాదని ప్రశ్నించారు.
బీఆర్‌ఎస్ విషయంలో అన్ని పార్టీలు ఆందోళన చెందుతున్నాయన్నారు. బీఆర్‌ఎస్ పార్టీని బీజేపీకి బీ టీమ్ అని ఒకరు… కాంగ్రెస్‌కు ఏ టీమ్ అని మరొకరు విమర్శిస్తున్నారని..కానీ తాము రైతుల పక్షాన మాత్రమే ఉన్నామన్నారు. ఆబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అనే నినాదందో ముందుకు వెళ్తున్నామని ప్రకటించారు. కొత్త ఉదయం దిశగా..క్రాంతి మార్గంలో దేశం నడవాలన్నారు. సౌత్ కొరియా, జపాన్, సింగపూర్ మలేషియా, లాంటి చిన్న దేశాలు ఎంతో ప్రగతి సాధించినట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. చైనా..ఓ దశలో పేద దేశమని, కానీ ఇప్పుడు చైనా ఎలా ఉందో తెలుసా అని ప్రశ్నించారు. మనం ఎక్కడ ఉన్నామని ఆయన ప్రశ్నించారు. దీనిపై ఆలోచించాల్సి అవసరం ఉందన్నారు. మహారాష్ట్రలో ఏ పార్టీకి అధికారం రాలేదో చెప్పండి..కాంగ్రెస్, శివసేన, బీజేపీలకు ప్రజలు అధికారం ఇచ్చారని, చేయాలనుకుంటే ఎవరైనా చేస్తారని, కానీ ఆ పార్టీలు ఏవి• చేయలేకపోయినట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. రైతుల మంచి కోసం ఏదైనా చేయవచ్చు అన్నారు. తనకు మరాఠీ రాదు అని, కానీ అన్నీ అర్థం చేసుకోగలనన్నారు. మహారాష్ట్ర పెద్ద రాష్ట్రం..ధనవంతమైన రాష్ట్రం అన్నారు. మహా నేతలు దివాలా తీస్తారని..కిసాన్లకు దివాలీ వొస్తుందన్నారు.
భారత్ పరివర్తన్ మిషన్ నడుస్తుందన్నారు. పండరీ దర్శనం కోసం వొస్తే..దర్శనం చేసుకోండి..కానీ రాజకీయం చేయకండి అన్నారని కొందరు నేతలు అన్నట్లు సీఎం తెలిపారు. పండరీ పుణ్య స్థలం అని..అక్కడ ఏవి• చెప్పలేదు..కానీ ఇక్కడ అనకుండా ఉండలేనన్నారు. అమెరికాలో నల్లజాతి వారిని ఎంతో వేధించారని, కానీ బరాక్ ఒబామాను గెలిపించి అక్కడి ప్రజలు ఆ రుణం తీర్చుకున్నట్లు కేసీఆర్ తెలిపారు. భారత్‌లో కూడా ఇలాంటి మార్పు రావాలని, రైతు ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలన్నారు. తెలంగాణలో ధరణి పోర్టల్‌తో భూముల్ని డిజిటలైజ్ చేసినట్లు సీఎం తెలిపారు. తెలంగాణలో జరుగుతున్న పథకాల అమలు..మహారాష్ట్రలో ఎందుకు జరగవని ఆయన నిలదీశారు. బీఆర్‌ఎస్‌లో చేరిన మరాఠీ నేత భగీరథ్ బాల్కేకు పూర్తి మద్దతు ఇస్తున్నట్లు కేసీఆర్ తెలిపారు. ఇక ఈ దేశానికి లక్ష్యం ఏమైనా ఉందా అని ఆయన ప్రశ్నించారు. లేకుంటే ఊరికే ఉన్నామా అని అడిగారు. ఇదే సరైన సమయం అని, లక్ష్యం గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. కొత్తగా స్వాతంత్య పోరాటం చేపట్టాలని, కొత్త ఉదయం దిశగా.. క్రాంతి మార్గంలో దేశం నడవాలన్నారు. చైనా..ఓ దశలో పేద దేశమని, కానీ ఇప్పుడు చైనా ఎలా ఉందో తెలుసా అని ప్రశ్నించారు. మనం ఎక్కడ ఉన్నామని ఆయన ప్రశ్నించారు. దీనిపై ఆలోచించాల్సి అవసరం ఉందన్నారు. మహారాష్ట్రలో ఏ పార్టీకి అధికారం రాలేదో చెప్పండి..కాంగ్రెస్, శివసేన, బీజేపీలకు ప్రజలు అధికారం ఇచ్చారని, చేయాలనుకుంటే ఎవరైనా చేస్తారని, కానీ ఆ పార్టీలు ఏవి• చేయలేకపోయినట్లు సీఎం కేసీఆర్ తెలిపారు.
రైతుల మంచి కోసం ఏదైనా చేయవచ్చు అన్నారు. కోట్లాది ఎకరాల సాగు భూమికి నీరును అందిస్తామన్నారు. ఔరంగబాద్‌లో 8 రోజులకు ఒకసారి నీళ్లు వొస్తాయన్నారు. సోలాపూర్‌లో 5 రోజులకు ఒకసారి వొస్తాయన్నారు. అకోలాలో కూడా నీళ్లు రావడం లేదన్నారు. కేంద్ర జలవిధానాన్ని బంగాళాఖాతంలో వేయాలన్నారు. జలనీతిని మార్చేస్తామన్నారు. నయా భారత్‌ను రూపొందిస్తామన్నారు. దేశంలో నీళ్లు లేవంటే అది మరో మాట అవుతుందని, కానీ నేతల మాయమాటలు చెప్పి నీళ్లు ఇవ్వలేకపోయినట్లు ఆరోపించారు. బొగ్గు విద్యుత్తు, సోలార్ పవర్, హైడ్రో పవర్, థర్మల్ పవర్ మాత్రం దేశంలో ఎటువంటి సమస్య లేదన్నారు. ఆ బొగ్గు రిజర్వులు బిలియన్ల టన్నుల్లో ఉన్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. కావాల్సినంత బొగ్గు నిల్వలు ఉన్నప్పుడు..విద్యుత్తు సమస్య ఎందుకు వొస్తుందని ప్రశ్నించారు. హైడ్రో, సోలార్, బొగ్గును సమతుల్యం చేస్తే, అప్పుడు దేశవ్యాప్తంగా విద్యుత్తు సమస్య ఉండదన్నారు. 125 ఏళ్లకు కావాల్సినంత బొగ్గు మన దగ్గర ఉందన్నారు. రైతుల కోసం 24 గంటల పాటు ఉచిత విద్యుత్తును తెలంగాణ ప్రభుత్వం అందిస్తుందని సీఎం కేసీఆర్ తెలిపారు. రైతులు ఒక్కటి కాకుంటే, మార్పు ఉండదన్నారు.
రైతులు బ్రతికి ఉంటే ఎవరు జీవిస్తారు..రైతులు మరణిస్తే ఎవరు బతుకుతారని ఆయన అన్నారు. దివ్యాంగులకు తెలంగాణ ప్రభుత్వం పెన్షన్ 4 వేలు ఇస్తుందన్నారు. మహారాష్ట్రలో బీఆర్‌ఎస్ సర్కార్ వొస్తే..అన్ని సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తామన్నారు. వృద్ధులకు పెన్షన్ ఇస్తామన్నారు. అమెరికాలో నల్లజాతి వారిని ఎంతో వేధించారని, కానీ బరాక్ ఒబామాను గెలిపించి అక్కడి ప్రజలు ఆ రుణం తీర్చుకున్నట్లు కేసీఆర్ తెలిపారు. భారత్‌లో కూడా ఇలాంటి మార్పు రావాలని, రైతు ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలన్నారు. తెలంగాణలో ధరణి పోర్టల్‌తో భూముల్ని డిజిటలైజ్ చేసినట్లు సీఎం తెలిపారు. తెలంగాణలో జరుగుతున్న పథకాల అమలు..మహారాష్ట్రలో ఎందుకు జరగవని ఆయన నిలదీశారు. రైతు ఇంట్లో పుట్టాను, నేను స్వయంగా రైతును, రైతు సంక్షేమం కోసం పనిచేస్తానని సీఎం కేసీఆర్ తెలిపారు. డిజిటల్ ఇండియా అని కేంద్రం చెబుతుందని, కానీ ఎందుకు భూముల్ని డిజిటైజ్ చేయడం లేదన్నారు. మేక్ ఇన్ ఇండియా అని ప్రధాని చెబుతారని, కానీ ప్రతి వీధిలో చైనా బజార్ ఎందుకు కనిపిస్తున్నట్లు ఆయన ప్రశ్నించారు. దీపావళి బాంబులు, రంగులన్నీ చైనా నుంచే ఎందుకు వొస్తున్నాయని ప్రశ్నించారు. ధరణి పోర్టుల్లో ఒకసారి రైతు డేటా ఎక్కితే, దాన్ని ఎవరూ మార్చలేరన్నారు. ఒక్క రైతు బయోట్రిక్ ద్వారానే దాన్ని మార్చే వీలు ఉందన్నారు. తెలంగాణ రైతుల వద్ద పాస్‌పోర్టు లాంటి సుందరమైన పాస్ బుక్ ఉంటుందని అన్నారు. తాము ఎవరికీ టీం కాదు అని.. తమది రైతుల టీమ్, దళిత టీమ్ అన్నారు. రైతులు తోడుంటే ఎవరి అవసరం లేదన్నారు సిఎం కెసిఆర్.




