అయినా కాంగ్రెస్‌ను పడగొట్టే ఉద్దేశ్యం లేదు
మేము ఊరుకున్నా..రేపు మోదీ ఊరుకుంటాడా
మమ్ములనే ఆగం పట్టించే ప్రయత్నం చేసిండ్రు
కక్షతోనే కవితపై లిక్కర్ కేసు
లోక్‌సభ ఎన్నికల తరవాత రాజకీయ గందరగోళం
బిఆర్‌ఎస్ ఖచ్చితంగా 11 సీట్లు గెలవబోతుంది
తెలంగాణలో పరిస్థితి మనకే అనుకూలం
22 నుంచి బస్సు యాత్రలు
బిఆర్‌ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో కెసిఆర్ సంచలన వ్యాఖ్యలు
బిఆర్‌ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో కెసిఆర్ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 18 : తనతో ఇరవై మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని మాజీ సిఎం, బిఆర్‌ఎస్ అధినేత సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన అవసరం తమకు లేదన్నారు. కానీ మోదీ ఈ ప్రభుత్వాన్ని పడగొట్టుకుం డా ఉంటారా అని ప్రశ్నించారు. 20 మంది ఎమ్మెల్యేలను తీసుకుని రావాలా సార్ అని ఓ సీనియర్ కీలక నేత తనను సంప్రదించాడని, అయితే ఇప్పుడే వద్దని వారించానని కేసీఆర్ తెలిపారు. గురువారం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ప్రతినిధులతో కేసీఆర్ చర్చించారు. ఈ సందర్భంగా కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ మనుగడపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ..లోక్‌సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయం గందరగోళం ఏర్పడే అవకాశం ఉందన్నారు. ఏ రాజకీయ గందరగోళం జరిగినా బీఆర్‌ఎస్‌కే మేలు జరుగుతుందని, ఉద్యమకాలం నాటి కేసీఆర్‌ను మళ్లీ చూస్తారని ఆయన అన్నారు.
బస్సు యాత్ర రూట్ మ్యాప్ ఇవాళ ఖరారవుతుందని, కాంగ్రెస్‌పై తీవ్ర వ్యతిరేకత ప్రారంభమైందని, రానున్న రోజులు తమవేనని, పార్లమెంట్‌లో తమ గళం వినిపించాల్సిన అవసరం ఉందని అన్నారు. కొందరు నేతలు పార్టీని వీడి వెళ్లినంత మాత్రానా బీఆర్‌ఎస్‌కు నష్టం ఏవ్ని లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్‌లో టీమ్ వర్క్ లేదు..స్థిరత్వం లేదని కెసిఆర్ విమర్శించారు. ఇప్పటి వరకు తాము 8 లోక్‌సభ సీట్లలో గెలుస్తామని సర్వేలు చెబుతున్నాయని, మరో మూడు స్థానాల్లో విజయావకాశాలు ఉన్నాయని కేసీఆర్ స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ కు 111 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను కొనేందుకు బిజెపి నేతలు ప్రయత్నించారన్నారు.
తాము దొరకబట్టుకున్నామని అందుకే మోదీ కక్ష కట్టారని కేసీఆర్ తెలిపారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీఎల్ సంతోష్‌ను అరెస్టు చేసేందుకు పోలీసుల్ని పంపామని..అందుకే అమిత్ షా, మోదీ కక్ష కట్టి..కవితను అరెస్టు చేయించారన్నారు. లిక్కర్ కేసు ఉత్తదేనని కేసీఆర్ వ్యాఖ్యానించినట్లుగా బీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఏడాదిలోనే కాంగ్రెస్ ప్రభుత్వం గందరగోళంలో పడుతుందని కెసిఆర్ జోస్యం చెప్పారు. భవిష్యత్ తమదేనని పార్టీ నేతలకు కేసీఆర్ భరోసా ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఇక రైతు సమస్యలు అజెండాగా ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లాలని, రైతు సమస్యలపై పోస్టుకార్డు ఉద్యమం ఉధృతం చేయాలని, ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో లక్ష పోస్టుకార్డులు రాయాలని, రైతుల కల్లాల కాడికి వెళ్లి రూ. 500 బోనస్‌పై ప్రభుత్వాన్ని నిలదీయాలని, ప్రభుత్వ హావ్నిలను కాంగ్రెస్ పార్టీకి గుర్తు చేయాలని కెసిఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని, దాన్ని అనుకూలంగా మలుచుకోవాలని కేసీఆర్ సూచించారు. బస్సు యాత్రం చేద్దాం.. జనం నుంచి మంచి స్పందన వొస్తుందని కేసీఆర్ తెలిపారు. ఈ నెల 22 నుంచి రోడ్డు షోలు నిర్వహిస్తామన్నారు. ఒక్కో లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని రెండు, మూడు అసెంబ్లీ ఏరియాల్లో రోడ్‌షోలు ఉంటాయన్నారు. రోజుకు రెండు, మూడు రోడ్‌షోలు ఉంటాయన్నారు. ఉదయం సమయంలో రైతుల వద్దకు వెళ్లాలని నిర్ణయించారు. సాయంత్రం వేళ రోడ్డు షోలు, కార్నర్ వ్నిటింగ్స్ నిర్వహించనున్నారు. వరంగల్, ఖమ్మం, మహబూబ్‌నగర్ సెంటర్లలో భారీ బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు కేసీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో భవిష్యత్ బీఆర్‌ఎస్‌దే.. రాబోయే ఎన్నికల్లో గెలుపు కూడా తమదేనని కేసీఆర్ స్పష్టం చేశారు. గట్టిగా పోరాడితే లోక్‌సభ ఎన్నికల్లో మంచి ఫలితాలు వొస్తాయన్నారు. బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన నేతలు బాధపడుతున్నారని, అధికారం ఉందని కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే అక్కడంతా బీజేపీ కథ నడుస్తుందని ఓ నాయకుడు తనతో వాపోయాడని కెసిఆర్ తెలిపారు.



