- బిజెపిపై కొందరు విషప్రచారం
- ఎప్పటికైనా కెసిఆర్ చట్టానికి జవాబుదారియే
- వరంగల్‌లో రేపు జరుగనున్న మోదీ సభకు ఏర్పాట్లను పరిశీలించిన బిజెపి ఎంఎల్‌ఏ ఈటల
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 6 : తెలంగాణలో బీజేపీ, బీఆర్‌ఎస్ కుమ్మక్కయ్యాయంటూ కొంత మంది విష ప్రచారం చేస్తున్నారని బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ మండిపడ్డారు. గురువారం హైదరాబాద్‌లో ఆయన వి•డియాతో మాట్లాడుతూ..బీజేపీ చాలా బలంగా ఉందని.. చాపకింద నీరులా పార్టీ విస్తరిస్తుందని చెప్పారు. ఠక్కున పైకి వెళ్లి పడిపోవడానికి.. బీజేపీ బలమేవి• సెన్సెక్స్ కాదన్నారు. తెలంగాణ గడ్డపై తమ విజయపరంపర 2019 ఎంపీ ఎన్నికలతో మొదలైందన్నారు. దుబ్బాక, హుజూరా బాద్ ఉప ఎన్నికలతో పాటు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటామని చెప్పారు. మునుగోడులోనూ నైతికంగా బీజేపీనే గెలిచిందన్నారు. బీఆర్‌ఎస్‌తో కొట్లాడింది బీజేపీనేనని అన్నారు. మూడున్నరేళ్లలో బీజేపీ గెలిచిందని..ఎక్కడో ఒక చోట అధికార దుర్వినియోగం, డబ్బులు, ప్రలోభాలతో బీఆర్‌ఎస్ గెలిచిందని.. కానీ కాంగ్రెస్ పార్టీ గెలవలేదని అన్నారు. బీఆర్‌ఎస్, బీజేపీ ఒక్కటయ్యాయని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
కేసీఆర్ కుటుంబ పాలనను, దోపిడీని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ఈ రోజు తప్పించుకునే ప్రయత్నం చేస్తుండొచ్చు.. కానీ చట్టం నుంచి తప్పించుకోలేరని చెప్పారు. దేశంలో కుటుంబ పార్టీల వల్ల వాళ్ల కుటుంబాలు మాత్రమే బాగుపడతాయని ప్రధాని మోదీ స్పష్టంగా చెప్పారన్నారు. బీజేపీపై చేస్తున్న కుట్రలను, కుతంత్రాలను తిప్పికొడుతామని తెలిపారు. మంచి ఏదో, చెడు ఏదో తెలుసుకునే శక్తి తెలంగాణ ప్రజలకు ఉందన్నారు. వొచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వొచ్చే ఆస్కారం ఉండటంతో కార్యకర్తలు, నాయకులు ఉత్సాహంతో పనిచేస్తున్నారని చెప్పారు. బీజేపీకి ఎక్కడికి వెళ్లిన ప్రజల నుంచి మద్దతు వెల్లువల వొస్తుందని చెప్పారు. వరంగల్‌లో ప్రధాని మోదీ సభను విజయవంతం చేస్తామని చెప్పారు. ప్రధాని మోదీ సభను రాష్ట్రంలోని పార్టీ యంత్రాంగంతా కలిసి విజయవంతం చేస్తామని అన్నారు. ప్రధాని పర్యటనపై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఇప్పటికే సవి•క్ష నిర్వహించారని తెలిపారు. పార్టీ యంత్రాంగ మంతా ప్రధాని సభను విజయవంతం చేస్తుందన్నారు. ఇటీవలి కాలంలో బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీల మధ్య పెద్దగా విమర్శలు చోటు చేసుకోవడం లేదు. అదే సమయంలో బీఆర్‌ఎస్ పై దూకుడుగా ఉండే బండి సంజయ్‌ను మార్చడంతో రెండు పార్టీల మధ్య అవగాహన కుదిరిందన్న ప్రచారం జరుగుతుంది.
ప్రధాని మోదీ సభతో మొత్తం ఇలాంటి ప్రచారానికి బ్రేక్ వేస్తామనే ధీమాతో పార్టీ వర్గాలు ఉన్నాయి. ఇక ఈటల మాట్లాడుతూ..మొదటి సారి ఓరుగల్లు గడ్డవి•దకు ప్రధాని మోదీ వొస్తున్నారన్నారు.పార్లమెంట్‌కు ఎంపీని పంపించి బీజేపీ పార్టీని అక్కున చేర్చుకున్న గడ్డ వరంగల్ అని… ప్రజలకు నేనున్నాననే భరోసా ఇవ్వడానికి ప్రధాని వరంగల్‌కు వొస్తున్నారని చెప్పారు. 400 కిలోవి•టర్లు ఉన్న జాతీయ రహదారులు ప్రధాని మోదీ వొచ్చాక రెట్టింపు అయ్యాయని ఈటల రాజేందర్ అన్నారు. శనివారం ఉదయం ఉదయం 9:30 గంటలకు ప్రధాని వరంగల్‌కు చేరుకుంటారని.. ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపిచ్చారు. కనీవినీ ఎరుగని తీరుగా ఈ విటింగ్ సక్సెస్ చేసి తీరుతామన్నారు. చాప కింద నీరులా బీజేపీ కార్యకర్తలు పని చేస్తున్నారని, కుట్రలు, కుతంత్రాలు తిప్పి కొట్టే సత్తా తెలంగాణ జాతికి ఉందని ఈటల రాజేందర్ అన్నారు. జరుగుతున్న పరిణామాలు ప్రజలంతా గమనించాలని, మాజీ ఆర్థిక మంత్రిగా తెలంగాణ రాష్ట్ర పరిస్థితి ఎంటో తనకు తెలుసునని అన్నారు. ఒంటరి మహిళల పెన్షన్లు నాలుగేళ్లుగా నిలిచిపోయాయని ఈటల విమర్శించారు.




