ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 17 :ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలోని జంగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన వెంకటయ్య అనారోగ్యంతో ఇటీవల మృతి చెందారు. నాటి పదవ తరగతి బ్యాచ్ కు చెందిన బాల్యమిత్రుల బృందం బుధవారం మృతుడి కుటుంబ సభ్యులను కలుసుకొని పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. రూ. 36 వేల నగదును మృతుడి భార్య కు అందజేశారు. బాల్య మిత్రబృందం ఆర్థిక సహాయాన్ని అందజేయడం పట్ల గ్రామస్తులు బాల్యమిత్రులను అభినందించారు.




