బాధిత కుటుంబానికి ఎస్ కే ఆర్ ట్రస్ట్ ద్వారా ఆర్ధిక సాయం

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, డిసెంబర్ 26: మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించి ఆర్థికంగా తమ వంతు ప్రోత్సహిస్తున్నామని వికారాబాద్ జిల్లా మాజీ గ్రంథాలయ చైర్మన్ సన్నగారి కొండల్ రెడ్డి పేర్కొన్నారు. మర్పల్లి మండల పరిధిలోని వీర్లపల్లి గ్రామానికి చెందిన నడిమి దొడ్డి రాములు  ప్రమాదవశతు సోమవారం మరణించారు.  అట్టి విషయం తెలుసుకుని ఎస్ కే ఆర్ ట్రస్ట్ వ్యవస్థాపకులు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ కొండల్ రెడ్డి నడిమి దొడ్డి రాములు  అంత్యక్రియలకు 5 వేల రూపాయలు పంపించగా గ్రామ నాయకులు, గ్రామస్తులతో కలిసి మృతుడి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ఎస్ కే ఆర్ పంపిన నగదును అందజేశారు. ఇట్టి కార్యక్రమంలో  G. నారాయణరెడ్డి చుక్కా రెడీ . పోలీస్ లక్ష్మారెడ్డి E వెంకట్ గార్లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *