బాజార్‌ఘాట్‌ అగ్నిప్రమాదంపై పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌దిగ్బ్రాంతి

ప్రభుత్వ వైఫల్యంతో హైదరాబాద్‌ అగ్ని ప్రమాదాలకు నిలయంగా మారిందని మండిపాటు  
హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 13 : ‌నాంపల్లి బజార్‌ ‌ఘాట్‌లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంపై టీపీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ •రెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ అగ్ని ప్రమాదాలకు నిలయంగా మారిపోయిందన్నారు. వరుస అగ్ని ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం నివారణ చర్యలు చేపట్టడంలో పూర్తిగా విఫలమైందన్నారు.

ఒక అపార్ట్‌మెంటులో జరిగిన అగ్ని ప్రమాదంలో 9 మంది మృతి చెందడం అత్యంత బాధాకరమైన విషయమన్నారు. అపార్ట్‌మెంటు సెల్లార్‌లో కారు మరమ్మతులు ఏంటని రేవంత్‌ ఆ‌గ్రహం వ్యక్తం చేశారు. రెసిడెన్షియల్‌ ఏరియాలో కెమికల్‌ ‌డ్రమ్ములు ఎలా నిలువ చేశారని ప్రశ్నించారు. ఈ విషయంలో సమగ్ర విచారణ జరపాలని డిమాండ్‌ ‌చేశారు. మృతులకు ప్రగాఢ సంతాపం. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని రేవంత్‌ ‌డిమాండ్‌ ‌చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *