‘‘యేన బద్ధో బలీరాజా దానవేంద్రో మహాబలః తేనత్వా మభిబద్నామి రక్షే మాచల మాచల’’…ఓ రక్షా బంధమా! మహా బలవంతుడూ, రాక్షసరాజు అయిన బలి చక్రవర్తిని బంధించావు..కాబట్టి నేను నిన్ను ధరిస్తున్నాను. సోదరి ప్రేమకు ప్రతిరూపంగా రక్షాబంధనాన్ని ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవడం భారతావనిలో అనాదిగా ఆచరణలో ఉన్న సత్సంప్రదాయం. మహావిష్ణువు, మహాబలి కోరిక మేరకు ఆయనతో పాతాళంలో ఉండి పోతారు. దేవతల కోరిక మేరకు మహాలక్ష్మి, పాతాళానికి వెళ్ళి, బలిరాజుకు రక్షాబంధనం గావించి, బలి ఇచ్చిన వరంతో తిరిగి వైకుంఠ నాథుని తీసుకు వెళుతుంది. ఇతిహాసాధారంగా శిశుపాలుని సంహరించే సమయాన సుదర్శన చక్ర ప్రయోగంలో శ్రీకృష్ణుని చూపుడు వేలు రక్తసిక్తమ వుతు ంది. వెంటనే ద్రౌపది తన పట్టుచీర కొంగును చించి, ఆ వేలుకుకడుతుంది.
దానికి కృతజ్ఞతగా గోపాలుడు, ద్రుపద రాజ తనయకు అన్ని వేళలా అండగా ఉంటానని మాట ఇచ్చి, దుశ్శాసనుడు వలువలు వొలిచే సమయాన పంచభర్త్రుకకు రక్షణ ఉంటారు. భవిష్యత్ పురాణా ధారంగా పూర్వం దేవతలకు, దానవులకు యుద్ధం జరగగా, ఓడిపోయిన దేవేంద్రుడు నిర్వీర్యుడై, పరివార సహితంగా అమరావతిలో తల దాచుకుంటాడు. చింతా క్రాంతుడైన స్వర్గాధిపతి దీన స్థితిని గాంచి, ఇంద్రాణి తరుణోపాయం యోచించి, రాక్షస రాజుఅ మరావతిని ఆక్రమించకుండా, దేవేంద్రునికి పార్వతీ పరమేశ్వరులను, లక్ష్మీనారాయణులను పూజించి, రక్షను కట్టి దేవేంద్రుని సమరోత్సాహ భరితుని గావిస్తుంది. దీనితో ఇంద్రుడు యుద్ధంలో గెలుపొంది, త్రైలోక్య ఆధిపత్యం పొందుతాడు. జగజేతగా నిలవాలనే పట్టుదలతో దేశాలను జయిస్తూ, చరిత్రలో క్రీ.పూ.326లో అలెగ్జాండర్ భారత దేశ దండ్రయాత్ర గావిస్తాడు. ఈ క్రమంలో అలెగ్జాండర్ బాక్ట్రియా (నేటి అఫ్ఘని స్థాన్)కు చెందిన యువ రాణి రోక్సానాను వివాహ మాడతాడు.
ఈ వివాహ బంధాన్ని వినియోగించుకుని, ఆయన మధ్య ఆసియా దేశాలు… ప్రధానంగా జీలం, చీనాబ్ మధ్య రాజ్యాలను జయించ ముందుకు సాగుతాడు. తక్షశిల రాజు పురుశోత్తముని శతృవు అంబి, అలెగ్జాండర్ ను భారత దేశం లోకి ఆహ్వానిస్తాడు. పురుశోత్తముడు యుద్ధానికి సర్వసన్నద్ధమవుతాడు. అలెగ్జాండర్ భార్య రోక్సానా, తక్షశిల రాజు పురుశోత్తముని సోదరునిగా భావించి, రాఖీ కడుతుంది. తన సోదరుని చంపొద్దని భర్తను కోరుతుంది. ఫలితంగా అలెగ్జాండర్ యుద్ధ విరమణ గావిస్తాడు. మొఘల్ చక్రవర్తి హుమాయూన్, చిత్తోరు ఘడ్ ను ఆక్రమణ చేసిన సమయంలో రాణా సతీమణి విధవ కర్మవతి, హుమాయూన్ కు రక్షను పంపి, తన కోరికను తెలియ జేసిన క్రమంలో మొఘల్ చక్రవర్తి, మాట ఇస్తే బహదూర్ షాతో యుద్ధం చేసి, రక్షించినట్లు కధనాలు. ఇలా పూర్వకాలం నుండి భార్య ప్రేమకు, అనురాగాలకు, రక్షణకు ప్రతీకగా రక్షాబంధనానికి ప్రత్యేకత ఉంది.
‘‘హయగ్రీవ జయంతి’గా, ‘జంధ్యాల’, ‘రాఖీ’, ‘నారీ పూర్ణి మగా పేరెన్నిక గన్న శ్రావణ పౌర్ణమి సర్వజనులకు పర్వ దినం. ఉపవాసాలకు ఉద్దిష్టమైన పండుగ కాక, హిందువులలో అన్ని తరగతుల వారూ వర్షాకాలపు రాకకు సంతసిస్తూ, మధుర పదార్థాలు భుజించడం అనుసరణీయమైన ఆహారం. పూర్వకాలంలో శ్రావణ పూర్ణిమ నాడు ఉపాక ర్మానంతరం వేదవిద్య ప్రారంభించడం జరిగేది. ఉపాకర్మపండుగకాక అధ్యయ యానికి సంబంధించిన కర్మ. ఉప నయనము అనగా అదనపు కన్ను.
గురువు తన ప్రజ్ఞా
ప్రాభవముల చేత వటువునకు జ్ఞాన నేత్రమును తెరిపించడమన్నది పరమార్థం.యజ్ఞం, ఉపవీతంతో కలిస్తే యజోపవీతం. ఉప వీతమంటే దారము. యాగకర్మ చేత పునీతమైన మూడు పోచల దారం. సృష్టి స్థితి, లయకారులైన త్రిమూర్తులను సూచించేవి ఒక్కో ముడిలోని మూడు తాళ్ళు.
ప్రాశస్త్యం
సర్వరోగ ఉపశమనం, సర్వాశుభ వినాశనం కోసం ధర్మజుడు శ్రీకృష్ణుడిని ఉపాయం అడుగగా, రక్షాబంధన విధి ఉపదేశించినట్లు, దేవాసుర యుద్ధంలో ఇంద్రుని ఇంద్రాణి రక్షాబంధంనం చేసి, విజయం సాధింప చేసినట్లు శ్రీకృష్ణుడు వివరించిన సందర్భం పురాణ కథనం. రక్షాబంధనం భార్య, భర్తకు కట్టాలని ఉన్నా ఆచరణలో సోదరియో, కూతురో కట్టే ఆచారాన్ని ప్రతోత్సవ చంద్రిక వివరిస్తుంది. శ్రావణ పూర్ణిమ రాఖీ పూర్ణిమ. రాఖీ అంటే తోరము. తోరం పట్టుదారముతో లేదా నూలుదారంతో చేయబడుతుంది. రాఖీ అనేది ఒక ఆభరణం లాంటిది. రంగుదారంతో లేదా కాగితంతో చేసి, దానికితోరం జోడించి, దానిని సోదరి సోదరుని ముంజేతికి కట్టడంసాం ప్రదాయం. బొట్టుపెట్టి హారతి నివ్వడం, సోదరుడు, సోదరికి కట్నకానుకలు సమర్పించడం ఆహారం. రాఖీ ప్రాధన్యతను బట్టే ఒక స్త్రీ పురుషులు రాఖీ పంపి లేదా కట్టి ఆతనిరక్ష కోరే ఆచారం ఏర్పడింది. దానిని అందుకోవడం తోనేఅతడు ఆమెకు సోదరుడై రక్షకుడవుతాడని భావన.
– రామకిష్టయ్య సంగనభట్ల…9440595494




