తాండూరు, ప్రజాతంత్ర, ఆగస్ట్ 18: సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ బహుజన వీరుడు అని జాతీయ బీసీ సంఘం కార్యవర్గ సభ్యులు రాజ్ కుమార్ అన్నారు. శుక్రవారం సర్దార్ సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా పట్టణంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఈ సందర్భంగా రాజ్కుమార్ మాట్లాడుతూ గోల్ కొండను స్వాధీనం చేసుకుని సాటిలేని యుద్ధ నైపుణ్యాలతో శివాజీ మహారాజు వలె మొగలులను వణికించిన ధీరుడు సర్దార్ సర్వాయి పాపన్న అని కొని ఆడారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు సయ్యద్ షుకుర్ బీసీ సంఘం పట్టణ మహిళా అధ్యక్షురాలు నాయికోడి జ్యోతి, తాండూర్ బషీరాబాద్ మండలాల అధ్యక్షులు బీసీ సంఘం నాయకులు బసవరాజ్, జగన్, విజయలక్ష్మి, సాయి, రాజు, మతిన్, నగేష్ తదితరులు పాల్గొన్నారు.




