బహుజన రాజ్యాన్ని చూడాలన్న గద్దర్ కోరికను నెరవేరుస్తాం

ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 07 : బహుజన రాజ్యాన్ని చూడాలన్న గద్దర్ కోరికను తాము నెరవేరుస్తామని బహుజన సమాజ్ పార్టీ(బి.ఎస్.పి) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్.ప్రవీణ్ కుమార్ అన్నారు. తెలంగాణలోని ఒక జిల్లాకు గద్దర్ పేరు నామకరణం చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం స్టేడియంలో గద్దర్ పార్థివదేహానికి ఆర్.ఎస్.పి నివాళులర్పించారు. సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ తన పూర్తి జీవితాన్ని పీడిత ప్రజల కోసమే అంకితం చేశారని కొనియాడారు. ల్యాండ్ అలాట్మెంట్ స్కీంకు గద్దర్ పేరు పెట్టాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఆయన ఆశయాలను బహుజన సమాజ్ పార్టీ ముందుకు తీసుకెళ్తుందని అన్నారు. ఆయన బాటల్లో ప్రతి ఒక్కరూ పయనించాలని.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *