బహుజనుల నోట్లో మట్టి కొట్టిన బిఆర్ఎస్

తాండూరు, ప్రజాతంత్ర, ఆగస్ట్ 21: వికారాబాద్ జిల్లాలో ఉన్న స్థానం వికారాబాద్ నియోజకవర్గం మినహాయించి మిగతా మూడు నియోజకవర్గాల్లో కేవలం అగ్రకులాల వారికే ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలకు టికెట్లు కేటాయించిన బిఆర్ఎస్ పార్టీ బహుజన ఓట్లు వద్దన్న నిర్ణయానికి వచ్చినట్లు అనిపిస్తుంది. 60 శాతం పైగా ఉన్న బీసీ సామాజిక వర్గానికి ఒక్క స్థానం కూడా కేటాయించకపోవడం అత్యంత దారుణం అని, దొరల పార్టీగా ఉన్న బిఆర్ఎస్ పార్టీకి బహుజన ఓట్లు కావాలి తప్ప వాళ్లకు సముచిత స్థానం ఇవ్వాలన్న సోయిలేని బిఆర్ఎస్ పార్టీకి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓటుతోనే బుద్ధి చెబుతారని అన్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ బిజెపి పార్టీలు కూడా ఇదే పంతాను కొనసాగిస్తే ఆ పార్టీలకు సైతం తగిన  బుద్ధి చెప్తాం అని అన్నారు. వికారాబాద్ జిల్లాలో పార్టీలకతీతంగా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీ అభ్యర్థులను శక్తి వంచన లేకుండా కృషిచేసి గెలిపించుకుంటాం అని అన్నారు. త్వరలో అన్ని రాజకీయపక్షాల బీసీ నేతలు కుల సంఘాల నేతలతో చర్చించి మా కార్యచరణ ప్రకటిస్తామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *