పలుమార్లు విన్నవించుకున్న పట్టించుకోని తాండూర్ డీఎం పులిందర్ గౌడ్
బిసి పొలిటికల్ జేఏసీ
ప్రజాతంత్ర కొడంగల్ డిసెంబర్ 14: సమయానికి బస్సు నడపాలని డిమాండ్ చేస్తూ దౌల్తాబాద్ మండల కేంద్రంలోని గాంధీ కూడలి వద్ద రోడ్డుపై కూర్చొని విద్యార్థులు ధర్నా నిర్వహించారు ఈ సందర్బంగా బిసి విద్యార్థి నాయకులు పులిందర్ గౌడ్ మాట్లాడుతూ నీటూర్ నర్సాపురం కౌడీడ్ గ్రామాల మీదుగా వెళ్లే బస్సు సమయానికి రాకపోవడంతో కొడంగల్ వెళ్లే విద్యార్థులకు మరియు దౌల్తాబాద్ పాఠశాలకు వచ్చే విద్యార్థులు సరైన సమయానికి తరగతులకు హాజరు కాలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం 8గంటలకు రావాల్సిన బస్సు 9కి పైగా అవుతుందని సాయంత్రం వేళలొ రావాల్సిన బస్సు ఆర్టీసీ నిర్లక్యం వల్ల రాత్రికి 8 గంటలకు ఇంటికి చేరాల్సిన దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.గతంలో డిపో డిఎం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ తీరు మారడం లేదని సీఎం నియోజకవర్గ అయి ఉండి కూడ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. స్థానిక ప్రజాప్రతినిధులు వీరన్న కుర్మని కృష్ణ ధర్నా దగ్గరకి వచ్చి విద్యార్థులకు నచ్చచెప్పి అధికారులతో మాట్లాడి రేపటి నుండి సరైన సమయానికి బస్సు వస్తుందని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. ఈ కార్యక్రమంలొ అంజి చాంద్ పాష,కృష్ణ నవీన్ తదితరులు పాల్గొన్నారు.





