నైనిటాల్, నవంబర్ : ఉత్తరాఖండ్ లోని బద్రీనాథ్ ఆలయాన్ని శనివారం నుంచి అధికారులు మూసివేసారు. మధ్యాహ్నం 3.35 గంటల తర్వాత నుంచి స్వామి వారి దర్శనానికి భక్తులను అనుమతించడం లేదు.
శీతాకాలం దృష్ట్యా తాత్కాలికంగా ఆలయాన్ని మూసివేస్తున్నట్లుగా దేవస్థానం మేనేజ్‌మెంట్ బోర్డు తెలిపింది.శీతాకాలంలో దాదాపు నాలుగు నెలలకి పైగా బద్రీనాథ్ ఆలయుం మంచుతో కప్పబడి ఉంటుంది. అందువల్ల భక్తులను అనుమతించరు. మళ్లీ మే నెలలో ఆలయాన్ని తిరిగి తెరుస్తారు.


