బదిలీపై వెళ్లిన తెలుగు ఉపాధ్యాయుడు శశిధర శర్మకు ఘ వీడ్కోలు

జగదేవపూర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 10: జగదేవపూర్ మండలం మునిగడప జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 11సంవత్సరాల నుండి తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేసిన ఆదరాసుపల్లి శశిధర్ శర్మ మంగళవారం బదిలీపై వర్గల్ మండలం లోని చౌదర్ పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు వెళ్లారు.ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు శశిధర శర్మ  పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు భావోద్వేగంతో ఘన వీడ్కోలు పలికారు.శశిధర్ శర్మ  జగదేవపూర్ మండల స్థానికుడిగా అందరికీ సుపరిచితులని, పలు ప్రభుత్వ కార్యక్రమాలలో వ్యాఖ్యాతగా వ్యవహరించారాని పాఠశాల ఉపాధ్యాయులు కొనియాడారు. అదేవిధంగా దశాబ్ద కాలం పైగా మునిగడప పాఠశాలలో పనిచేయడంతో  విద్యార్థుల తల్లిదండ్రులతో,గ్రామస్తుల తో మంచి అనుబంధం ఏర్పడిందని తెలియజేశారు. శశిధర్ శర్మ బదిలీ పై వెళ్తున్న సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు భావోద్వేగానికి లోనయ్యారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కనకయ్య, పిఆర్టియు జగదేవపూర్ మండల అధ్యక్షుడు సిహెచ్.  వెంకట్రాంరెడ్డి  మునిగడప ఉపాధ్యాయుడు మధుసూధన్ వెంకటయ్య నవీన్ శ్రీనివాస్ రెడ్డి తులసీదాస్ పోచయ్య శ్రీవాణి సుభాషిని తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *