బతుకమ్మతో ప్రజల బాగుండాలి

షాద్ నగర్ ప్రజా తంత్ర అక్టోబర్ 19:  ఈ విజయదశమికి ప్రారంభమైన బతుకమ్మ పండుగతో ప్రజల బ్రతుకులు బాగుపడాలని దుర్గామాతను కోరుకుంటున్నట్టు షాద్ నగర్ అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి వీర్లపల్లి శంకర్ అన్నారు. గురువారం స్థానిక బుగ్గారెడ్డి గార్డెన్ లో రెడ్డి జాగృతి ఆధ్వర్యంలో జరిగిన బతుకమ్మ సంబరాలకు అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి వీర్లపల్లి శంకర్, కేశంపేట జడ్పిటిసి విశాల శ్రావణ్ రెడ్డి తదితర కాంగ్రెస్ శ్రేణులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ.. ఈ దసరా పండగతో సంబరాలు జరుపుకుని వచ్చే విజయదశమికి ప్రజలబతుకులు బాగుపడబోతున్నాయని బతుకులుబాగుపడబోతున్నాయని బాగుపడబోతున్నాయని శంకర్ అన్నారు. మహిళలు ఈ నవరాత్రులు ఎంతో ఘనంగా దుర్గామాత ఉత్సవాలు జరుపుకోవాలని అంతేకాకుండా పల్లె నుండి పట్టణాల దాకా బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటే విదంగా జరపడం ఎంతో కన్నుల పండుగగా ఉంటుందని అన్నారు. రెడ్డి సేవాసమితి, రెడ్డి జాగృతి  విభాగాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం ఎంతో గొప్పదని వారికి అభినందనలు తెలిపారు. జడ్పిటిసి విశాల మాట్లాడుతూ రెడ్డి జాగృతి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి తమని ఆహ్వానించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. మహిళలకు ఎంతో ఇష్టమైన బతుకమ్మ సంబరాలు ప్రతి గ్రామంలో జరుపుకుంటారని అందరూ భక్తిశ్రద్ధలతో ఈ విజయదశమి వేడుకలు జరుపుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు రెడ్డి సేవాసమితి అధ్యక్షులు మదన్మోహన్ రెడ్డి గుర్రం రవీందర్ రెడ్డి, శ్రవణ్ రెడ్డి కృష్ణారెడ్డి పురుషోత్తం రెడ్డి, రెడ్డి జాగృతి నాయకురాలు అరుంధతి తదితరులు హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *